తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమైన ఎమ్మెల్సీ రిమాండ్ గడువు ముగియనుండటంతో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల తీరుపై మృతుడి కుటుంబీకులు మొదట్నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ సిబిఐకు అప్పగించాలని కోరుతున్నారు. కేసు దర్యాప్తు తీరుతో పాటు, కాకినాడ ఎస్పీ వైఖరిపై బాధితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో మిగిలిన నిందితుల్ని ఇంతవరకు పట్టుకోకపోవడం, ప్రమాదవశాత్తూ హత్య జరిగిందనే నిందితుడి వాదనకు అనుగుణంగా దర్యాప్తును ముగించే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు సిబిఐకు అప్పగించాలని కోరుతూ గవర్నర్‌కు టీడీపీ సహా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి.
మరోవైపు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మానవ హక్కుల కమిషన్‌లో విచారణ జరిగింది. ఈ విచారణకు బాధిత కుటుంబసభ్యులు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో కలిసి హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసులు సహకరిస్తున్నారని, పోలీసుల తీరుపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా నిందితుడికి పోలీసులు అందిస్తున్న సహకారంపై ఉన్న ఆధారాలను అందచేశారు. అనంతబాబుకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 18న కర్నూలులో మరోసారి కమిషన్ విచారణ జరుపనుండటంతో అక్కడ జరిగే హాజరవుతామని బాధితులు తెలిపారు.
కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న అనంతబాబు తన వద్ద పనిచేసి మానేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని మృతుడి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోవడం ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యగం ఇచ్చింది. హత్య కేసులో నిందితులెవరు, హత్యకు కారణాలు ఏమిటనేది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో అనధికారిక డాన్‌గా చలామణీ అవుతున్న అనంతబాబుకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో దర్యాప్తు మీద ప్రభావం చూపుతుందని బాధితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more