పార్లమెంట్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధమేది విధించలేదని.. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పలు పదాలను పార్లమెంటు ఉభయ సభల్లో వినియోగించరాదని, వాటిని నిషేదించామని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘సిగ్గుచేటు, ‘జుమ్లాజీవి’, ‘దుర్వినియోగం’, ‘ద్రోహం’, ‘అవినీతి’, ‘నాటకం’, కొవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ తదితర పదాలు అన్‌పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ బుక్‌ను విడుదల చేయగా.. వివాదాస్పదమైంది.
ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ పార్లమెంటరీ పద్ధతులపై అవగాహన లేని వ్యక్తులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, చట్టసభలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పని చేస్తాయన్నారు. ‘సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ లాక్కోలేరు. కానీ, అది పార్లమెంట్ పద్ధతి ప్రకారం ఉండాలి’ అన్నారు. చట్టసభలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాయన్న ఆయన.. 1959 నుంచి ఈ సాధారణ అభ్యాసం కొనసాగుతుందన్నారు. తొలగింపు కోసం ఎంచుకున్న పదాలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉపయోగించారని బిర్లా పేర్కొన్నారు.
కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పాలనను సరైన రీతిలో ఎండగడుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా మారాయంటూ రాహుల్ విమర్శించారు. జుమ్లా, కొవిడ్ స్ప్రెడర్, కరప్ట్ వంటి పలు పదాలను అన్‌పార్లమెంటరీగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలోకి ఎంటరై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను సరైన రీతిలో ఎండగడుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా మారాయని, వీటిని మాట్లాడకుండా నిషేధించారని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌కు రాహుల్ గాంధీ న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా అనే క్యాప్షన్ ఇచ్చారు. జుమ్లా జీవి, కొవిడ్ స్ప్రెడర్, స్నూప్గేట్తో పాటు తరచూ వాడే సిగ్గుచేటు, వేధింపులు, బూటకం, డ్రామా, హిపోక్రసీ, అసమర్ధత అని అర్ధం ధ్వనించే పదాలను కూడా లోక్‌సభ, రాజ్యసభలో అన్‌పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ పదాలను అన్‌పార్లమెంటరీ జాబితాలో ప్రస్తావించడం పట్ల టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పదాలను తాను వాడతానని, దమ్ముంటే స్పీకర్ తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more