తెలంగాణ వ్యాప్తంగా మునుపెన్నడూ లేని వర్షాలు, వరదలతో ముంచెత్తుతోంది. దీంతో లోత్తట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాల యంత్రాంగం, రెన్క్యూ టీమ్ లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. భద్రాచలం పరివాహిక ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితుల దృష్యా అక్కడ ఎలాంటి పరిస్థితుల్లు తలెత్తినా వెంటనే అదుకునేందుకు హెలికాప్టర్లను కూడా సిద్దం చేశారు. జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగి భద్రాచల ప్రజలను అదుకునేందుకు సిద్దంగా ఉంది.
దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ముందుకొచ్చే ఆర్మీ.. భద్రాచలం పరివాహిక ప్రాంతాలకు చేరుకుంది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఏర్పడిన సమయంలో బాధితులకు తమ వంతు సహాయం అందించే జవాన్లు.. భద్రాచలం ప్రజలకు కూడా సాయం అందించేందుకు సంసిధ్దులైవున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు , వరదలు రికార్డ స్థాయిలో ముంచెత్తుతున్నాయి. దీంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనం స్తంభించింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఈ ఆర్మీ బృందం పునరావాస చర్యలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరినట్లు సోమేశ్ కుమార్ చెప్పారు. దీంతో 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రర్డీ కొత్త గూడెం జిల్లాకు వస్తున్నాయని వెల్లడించారు.
మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జేసీఓ లు, 92 వివిధ ర్యాంకుల వారున్నారని సి.ఎస్ తెలిపారు. సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బోట్ లను సిబ్బందితో సహా భద్రార్ది జిల్లాకు పంపామని తెలిపారు. ఫైర్ విభాగానికి చెందిన 7 బోట్ లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీలు ఎం.డి. ఎం. శ్రీదర్ లను ప్రత్యేక అధికారిగా నియమించామని సోమేశ్ కుమార్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ పునరావాస చర్యలకు ఉపయోగించాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, భద్రార్డీ కొత్తగూడెం జిల్లాలతో పాటు ములుగు, భూపాల పల్లి, పెద్ద పల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సి.ఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలుగ కుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సి.ఎస్. అధికారులను ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more