తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనకు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ 'సాలు దొర.. సెలవు దొర' పేరుతో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రచారంపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇవాళ గట్టి షాక్ తగిలింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది.
'సాలు దొర.. సెలవు దొర' అంటూ సీఎం ఫొటోలు, పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని పేర్కొంటూ.. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్ కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మీడియా సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో కమిటీ నియామకం జరిగింది.
జాతీయ పార్టీలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తాము చేసే ప్రచారానికి సంబంధించిన అన్ని విషయాలపై సర్టిఫికేషన్ కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. తాము అనుమతించని వాటిని ప్రచారంలో ఉపయోగించే పార్టీలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం సర్టిఫికేషన్ కమిటీకి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రచారానికి అనుమతి ఇవ్వాలని గత నెలలో మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది.
అయితే ప్రచార టైటిల్, సీఎం ఫొటోలు వాడే విధానం, అందుకు పెడుతున్న క్యాప్షన్ లు అభ్యంతరకారంగా ఉన్నాయని అభిప్రాయ పడుతూ బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ ప్రారంభించిన 'సాలు దొర.. సెలవు దొర' క్యాంపెయిన్‌కు బ్రేక్ పడనుంది. రాజకీయ పార్టీల ప్రచార విధివిధానాలు ప్రజలకు తమ పార్టీ గురించి అవగతం అయ్యేలా ఉండాలే తప్ప.. ప్రత్యర్థి పార్టీల తప్పిదాన్ని ఎత్తిచూపేలా ఉండరాదని కమిటీ అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయం టీఆర్ఎస్ వర్గాలకు బిగ్ రిలీఫ్‌గా మారనుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more