ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషిన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి రమణ పేర్కోన్నారు. ఇప్పటికే శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న అపవాదు న్యాయవ్యవస్థపై ఉందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. తాము ప్రజలకు ఇచ్చే ఎన్నికల హామీలపై రాజకీయ పార్టీలను జవాబుదారి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టును కోరారు. ‘ఇది తీవ్రమైన అంశం. కాదని ఎవరూ అనరు. ఉచిత ప్రయోజనాలు పొందుతున్న వారు, అవి కావాలని, తమది సంక్షేమ రాజ్యమని భావిస్తుంటారు. కొందరు తాము పన్నులు చెల్లిస్తున్నామని, దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతుంటారు. కనుక రెండు వైపుల వారి అభిప్రాయాలను కమిటీ వినాలి’’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
పూర్తి డేటా అందిన తర్వాతే ఉచిత హామీలపై ఏ మేరకు జోక్యం చేసుకోవాలన్న విషయాన్ని పరిశీలిస్తామని జస్టిస్. ఎన్.వి రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఉచిత హామీల పరిశీలనకు సంబంధించి ఒక కమిటీని నియమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు.. కేంద్రం, ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కమిటీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా మాజీ సీఈసీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, ఆర్బీఐ గవర్నర్ లేదా మాజీ గవర్నర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నీతి ఆయోగ్ సీఈఓ, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ సభ్యులుగా ఉంటారని ఈసీ.. కోర్టుకు విన్నవించింది.
అంతకుముందు ఉచిత హామీలకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషిన్పై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఉచితాలు, సాంఘిక సంక్షేమ పథకాలు రెండూ వేర్వేరు అంశాలని.. వీటిని ఒకే గాటిన గట్టకూడదని సూచించారు. దేశంలో పేదరికం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, పేదల ఆకలి తీర్చే ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం.. వాదోపవాదాలు విన్న అనంతరం విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more