శాసనమండలిలో విపక్ష నేత దాడి వీరభద్రరావు పుస్తక రచనలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం రాజసూయ యాగం అనే నాటకాన్ని దాడి రచించారు. అది పలు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఆయన తులసీ రామాయణాన్ని రచిస్తున్నారు. తులసీ రామాయణ ప్రాశ స్త్యాన్ని తెలుగు ప్రజల ముందుంచేందుకు ఈ పుస్తక ర చనలో నిమగ్నమైనట్టు ఆయన తెలిపారు. ఈ పుస్తకంతో పాటు చట్టసభల నిబంధనలపై మరో పుస్తకాన్ని రచిస్తున్నారు. చట్టసభల్లో పాటించాల్సిన నిబంధనలు, ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల్లోని లోపాలు, వాటిని సవరించేందుకు తీసుకురావలసిన మార్పులను ఇందులో ప్రస్తావించనున్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో దీన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. కళల పట్ల ఆసక్తిని ప్రదర్శించే ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి విశాఖపట్నంలో ని రంగశాయి నాటక గ్రంథాలయానికి తాజాగా రూ.లక్ష కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more