ఇది సినిమా కాదు. తీవ్రమైన అంశం’ అంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అసోం హింస పై సభలో సభ్యులు లేవనెత్తిన స్వల్పకాలిక చర్చకు సమాధానం ఇస్తున్న సందర్భంగా ఆయన సమాజ్‌వాది సభ్యురాలు జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అసోం హింసపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కాకుండా మంత్రి వేరే అంశాన్ని ప్రస్తావిస్తున్నారంటూ జయాబచ్చన్ విచారం వ్యక్తం చేశారు. తన సమాధానానికి మధ్యలో జయ ఆటంకం కలిగించడం షిండేలో ఒకింత ఆగ్రహానికి కారణమైంది. తాను మాట్లాడుతుండగా ఆమె మధ్యలో అడ్డుతగలడం సరికాదని ఆయన భావించారు. దీనితో సినిమా నటి కూడా అయిన జయ పట్ల ఒక్కసారిగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. షిండే వ్యాఖ్యల పట్ల జయాబచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు.
ఆమెకు సభలోని విపక్ష సభ్యులు కూడా గొంతు కలిపారు. విపక్షాల గందరగోళం నేపథ్యంలో చివరికి షిండే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు గౌరవ సభ్యురాలిని నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ‘జయాబచ్చన్ ప్రముఖ వ్యక్తి. రాజ్యసభ సభ్యురాలు కూడా. ఈ దేశ హోంమంత్రిగా మీరు సభలో ఆమెను ఆక్షేపించడం తగదు’ అని షిండేకు హితవు పలికారు. సభ సజావుగా నడవాలంటే షిండే వ్యాఖ్యలు సవరించుకోవాలని, జయాబచ్చన్‌ను ఉద్దేశించి అన్న మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, షిండే తొలుత తన వ్యాఖ్యల పట్ల చాలా పట్టుదలగా ఉన్నారు. సభలో హోంమంత్రి మాట్లాడుతుండగా జయాబచ్చన్ అడ్డుతగలడం ద్వారా సరైన రీతిలో వ్యవహరించలేదని అన్నారు. ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్ స్థానంలో తారిఖ్ అన్వర్ ఉన్నారు. షిండే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్‌కు అరున్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. అనంతరం ‘నా వ్యాఖ్యల వల్ల జయాబచ్చన్ మనోభావాలు గాయపడినట్లయితే.. క్షమాపణ చెబుతున్నాను. ఆమె నా సోదరి. జయ కుటుంబం మొత్తం నాకు తెలుసు. ఆ కుటుంబం పట్ల నాకు ఎంతో గౌరవ భావం ఉంది’ అని షిండే వివరణ ఇచ్చారు. షిండే వివరణతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో షిండే సమాధానాన్ని పూర్తిచేయకుండానే అర్ధంతరంగా ముగించారు. ఇతర ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more