బాలకృష్ణ అంటే మన టాలీవుడ్ హీరో బాలకృష్ణ కాదులేండి. యోగా గురు బాబా రాందేవ్ సన్నిహిత సహాయకుడు బాలకృష్ణ మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్రయోధుల పక్కన ఉన్నట్టు చూపించే పోస్టర్ వివాదాస్పదమైంది. రాందేవ్ నిరసన చేపట్టిన రాంలీలా మైదాన్ వేదిక వద్ద ఈ పోస్టర్ కనిపించింది. ఆ పోస్టర్ పై యోగా గురు విచారం వ్యక్తం చేశారు. గాంధీజీ, భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర సమర యోధుల స్థాయి వ్యక్తి బాలకృష్ణ అనే భావాన్ని ఆ పోస్టర్ కలిగించడంతో సమస్య మొదలైంది. ఈ పోస్టర్‌పై టీవీ ఛానళ్లలో వార్తా కథనం ప్రసారం కావడంతో నిర్వాహకులు వెంటనే స్పందించి దీక్షా వేదిక దగ్గరున్న పోస్టర్‌లను తొలగించారు. ‘ఇందుకు నేను బాధపడుతున్నాను. ఇలాంటి పోస్టర్లు వేయవద్దని నేను కార్యకర్తల్ని కోరుతున్నాను. ఇది అసలు సమస్యను పక్కదారి పట్టిస్తుంది’ అని రాందేవ్ చెప్పారు. నకిలీ డాక్యుమెంట్ కేసులో బాలకృష్ణ సిబిఐ కస్టడీలో ఉన్నాడు. రాష్ట్రీయ లోక్‌దళ్ ఎంపీ జయంత్ చౌదరి మాట్లాడుతూ - ‘సమరయోధులకు సంబంధించి ఆ స్థాయివారితో ఎవరినైనా చూపించేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడనేది, ఆ మనిషి చరిత్రను దృష్టిలో ఉంచుకోవాలి’ అన్నారు
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more