ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. అధికారం ఇస్తే అన్నీచేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. పాత పాపాలకు లెంపలు వేసుకుంటూ కొత్త వరాలు కురిపిస్తూ సాగే ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి మరో మూడేళ్ల సమయం ఉంది. అయినా, ఆయన ప్రతిన తీసుకున్నారు. గ్రామాలన్నింటినీ విద్యుత్ కాంతులతో నింపలేకపోతే ఓటు అడగబోనని సంకల్పం పూనారు.రాష్ట్రం నుంచి అవినీతిని తరిమికొడతానని ప్రకటించి..ఆ ప్రయత్నంలో అనేక విప్లవాత్మక చర్యలకు ఆద్యునిగా నిలిచిన బీహార్ సీఎం నితీశ్‌కుమార్ 'వెలుగు' బాట పట్టిన తీరిది. చీకట్లో మగ్గుతున్న బీహారీలకే కాదు, విలువలు లేని రాజకీయాలతో విసుగు చెందుతున్న ప్రతివారికీ ఆశ రేపే ప్రకటనను బుధవారం స్వాతంత్ర వేడుకల వేదికగా చేశారు.
"విద్యుత్ సమస్యపై ప్రస్తుతం మా ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. ప్రతి గ్రామానికి వెలుగులు అనే లక్ష్యాన్ని మరికొన్ని ఏళ్లలో చేరుకుంటాం.లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓటు ఆడిగేది లేదు'' అని స్పష్టం చేశారు. మాటలే కాదు.. రాబోయే కాలంలో చేతలు ఎలా ఉండబోయేది ఆయన వివరించారు. "నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పాట్నా సమీపంలోని బర్ జిల్లాలో నెలకొల్పుతున్న ప్లాంట్‌లో సముచిత వాటాను డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ప్రైవేట్ ప్లాంట్ల ఏర్పాటుకు వీలుగా అన్ని అవరోధాలను తొలిగించాం'' అని వివరించారు. కాగా, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ విషయంలో బీజేపీకి తాను అల్టిమేటం ఇచ్చినట్టు వచ్చిన వార్తలను బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఖండించారు. " మోడీని ప్రధానిని చేస్తే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామ''ని తాను ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more