ప్రజలకు అవసరమైనంత కరెంటు ఇవ్వడం మీకు చేతకాదు. విద్యుత్ శాఖను మాకిస్తే 15 రోజుల్లో మెరుగైన సరఫరా చేసి చూపిస్తాం'' అని సీఎంకి టీడీపీ నేతలు సవాల్ విసిరారు. అసెంబ్లీని సమావేశపరచి విద్యుత్ సరఫరాపై నిర్దిష్ట విధానం ప్రకటించాలని కోరారు. లేదంటే సీఎం పదవి నుంచి కిరణ్ తప్పుకోవాలని సూచించారు. కరెంటు కోతలకు వ్యతిరేకంగా తిరుపతి సదరన్ డిస్కం కార్యాలయం వద్ద టీడీపీ మహాధర్నా నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.ధర్నాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పేరిట రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ ఆరేళ్లపాటు సీఎంగా ఉన్న వైఎస్ కేవలం వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయించగలిగారని విమర్శించారు. సీఎం సొంత జిల్లాలో కూడా కరెంటు సరఫరా అస్తవ్యస్తంగా ఉందని పీఏసీ చైర్మన్ ఆర్ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సదరన్ డిస్కం సీఎండీకి వినతి పత్రం సమర్పించారు. కాగా, విద్యుత్ సరఫరాలో లోపాలు, హెచ్చుతగ్గులు ఉన్నమాట వాస్తవమేనని, ఇందుకు క్షమించాలని సదరన్ డిస్కం సీఎండీ విద్యాసాగర్‌రెడ్డి ప్రజలను కోరారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more