కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరనున్నారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మధ్య చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత ఎమ్మెల్యేల చేరికలుంటాయని టీఆర్ఎస్ నాయకుడొకరు చెప్పారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారనే విషయాన్ని పార్టీ రహస్యంగా ఉంచుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా ఇప్పుడు శాసనసభలో ఆ పార్టీ బలం 17కు పెరిగింది. టీడీపీ పార్టీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. వీరుకాక మొదట్లో కాంగ్రెస్ అనుబంధ సభ్యుడుగా కొనసాగిన స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా మారారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో చాలా మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఈ ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగరలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పాటు పరకాల ఉప ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలవడం వంటి అంశాలతో చేరికలపై ఇప్పటి వరకూ భిన్నమైన ప్రచారం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more