Vijayawada kanakadurga temple temple

vijayawada kanakadurga temple temple, durgamma, 28 crores,

vijayawada kanakadurga temple temple

kanakadurga.gif

Posted: 10/06/2012 02:46 PM IST
Vijayawada kanakadurga temple temple

vijayawada kanakadurga temple temple

కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు జరపటానికి పనులు వేగం జరుగుతున్నాయి. దసర పండుగ సందర్భంగా అమ్మావారికి  నవరాత్రులు జరపటం ఆనవాయితీ వస్తున్నా ఆచారం. కానీ ఇంతలోనే  దుర్గమ్మ భక్తులకు ఒక చేదు నిజం తెలిసింది. అమ్మ గుడిలో పెద్ద దొంగలు పడ్డారని . 28 కోట్ల రూపాయలు మాయం అయినట్లు తెలిసింది.  ఈ వార్త విని దుర్మమ్మ భక్తులు షాక్ అయ్యారు.  విజయవాడ కనకదుర్గమ్మ గుళ్లో దొంగలు పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా 28 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగింది. హెచ్ఎంటీవీ ఈ అవినీతిని కొద్ది రోజుల క్రితమే ఎండగట్టింది. ఇది మరోసారి పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ విచారణలో కూడా ఈ చేదు నిజం వెలుగు చూసింది.రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రెండవ దేవాలయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గగుడి. ఈ ఆలయానికి ఏడాదికి 42 నుంచి 44 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. వీటితో ఆలయంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అయితే ఆలయంలో ఈవో నుంచి ఇతర శాఖలన్నింటిలోనూ అవినీతి పేరుకుపోయింది. ప్రతీ పనిలోనూ కమిషన్లు మింగేస్తున్నారు. మింగేసిన డబ్బుకే కాదు. పని చేసిన డబ్బుకు కూడా లెక్కలు చెప్పలేని పరిస్థితిలో అధికారులున్నారు. దీనికి ఇక్కడ జరిగిన గోల్ మాలే కారణం.

అలాంటి ఈ దుర్గగుడి లెక్కల వ్యవహారంపై పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ దృష్టి పెట్టింది.ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయమే అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో లెక్కలు చూశారు. అమ్మవారిని దర్శించుకున్న ఆనందం అక్కడ లెక్కలు చూసే సరికి ఆవిరయిపోయింది. మొత్తం 28 కోట్ల రూపాయలకు లెక్కలు కనిపించలేదు. ఈ మొత్తం మిసిలీనియస్ అండ్ అదర్స్ అనే ఎకౌంట్లో వేశారు. కోట్ల రూపాయలు అనామతు ఖాతాలో ఉండటం అవినీతికి గేట్లు తెరిచినట్లేననేది నిపుణుల అభిప్రాయం. దీంతో అవాక్కయిన పీఏసీ అధికారులపై ఆలయ సిబ్బందిపై మండిపడ్డారు. ఈవోతో సహా పలువురు ఈ తప్పుల లెక్కలకు... అవినీతి పర్వానికి మూలపురుషులుగా భావిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను పీఏసీ ఛైర్మన్ ఆర్.ప్రకాష్ రెడ్డి ఆదేశించారు.   పీఏసీ పర్యటనతో దుర్గగుడిపై కలకలం రేగింది. లెక్కలపై అందరి దృష్టి పడింది.  కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడిన అధికార, నాయకగణంపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. దుర్గగుడికి కమిటీ లేనందునే అధికారుల ఇష్టారాజ్యం అయిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ స్థాయిలో అనామతు ఖాతా ఉంటే అవినీతి కచ్చితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో సంబంధం ఉన్న నాయకులను కూడా బయటకు లాగాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి దుర్గగుడి లెక్కల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. విచారణ పూర్తయితో చాలా మంది అధికారుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kejriwal scores big with vadra
Sachin tendulkar concedes retirement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more