కాల్పనిక కథలతో రంగుల చిత్రాలు సృష్టించుకునే ఓ దర్శకుడు.. ప్రత్యేక ఆకాంక్షతో సాగుతున్న విశిష్ట ఉద్యమంపై తన మనసులో ఉన్న ద్వేషాన్నంతా వెండి తెరపై కక్కేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రాన్ని కుంభకోణాల మయంగా మార్చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రాజకీయ నేతను భుజాలపై ఎత్తుకుని మోసేస్తే ఎలా ఉంటుంది? అచ్చం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలా!! ఈ సినిమాలో సమకాలీన రాజకీయాల ప్రస్తావనే ఉండదని సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు చెప్పిన దీని దర్శకుడు పూరీ జగన్నాథ్.. అవే రాజకీయ పరిణామాలను తన కథకు ఆసరా చేసుకున్నారు. అంతవరకూ అభ్యంతరం లేదు! అయితే.. తన కథకు మసాలా జోడించడం కోసం.. పైత్యం ముదిరిందన్నట్లు ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై నిప్పులుగక్కడం.. విపక్ష నాయకుడిని, ఆయన కొడుకును దుష్టపాత్రల్లో చూపించి.. పరోక్షంగా ఉద్యమ నేతలపై విషం చిమ్మడం అంతర్లీనంగా అర్థమవుతుంది! తను చేస్తున్న దాడి ప్రేక్షకుడికి తెలియకుండా చూసే తాపత్రయంలో పార్టీలను, పార్టీల నేతలను కలగాపులగం చేసేసి.. విమర్శల నుంచి బయటపడిపోవచ్చని చేసిన ప్రయత్నం స్పష్టంగా గోచరిస్తుంది!!తెలంగాణ ఉద్యమంపై పూరీ జగన్నాథ్ కక్కిన విషమే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయాంశాలు ఉండవని, ఓ రాజకీయ నాయకుడికి, మీడియా రిపోర్టర్‌కు మధ్య జరిగే పోరాటమే ఇతివృత్తమని విడుదలకు కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూల్లో చెప్పారు చిత్ర దర్శకుడు. బడా రాజకీయ నాయకుడు సృష్టించే ఓ పెద్ద సమస్య నుంచి రాష్ట్రాన్ని సదరు రిపోర్టర్ కాపాడటమే కథని తెలిపారు.
ప్రతి సారీ తెలంగాణ వాదులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావటంలేదు. ఇటీవల పూరి జగన్ రెండు సినిమాలు విడుదల చేసిన విషయం తెలిసిందే . అయితే వాటి పై తెలంగాణ వాదులు దాడి చెయ్యలేదు. ఆ సినిమాలు తీసినప్పుడు రాని ఇప్పుడు రాంబాబు కక్ష ఎందుకు కట్టారో పూరీ అభిమానులు అడుగుతున్నారు. రీసెంట్ పూరీ బిజినెస్ మెన్ , దేవుడు చేసిన మనుసులు సినిమాలకు డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాల్లో తెలంగాణ కు అనుకూలంగా ఉన్నాయా? తెలంగాణ ప్రజలు కూడా ఆ సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా? మరీ ఇలాంటి సమయంలో రాంబాబు పై కక్ష దేనికి ? ప్రతి సారీ పవన్ కళ్యాణ్ సినిమాకే తెలంగాణ వాదులు ఎందుకు అడ్డుపడుతున్నారు. కొమరం పులి, సినిమా అప్పుడు కొమరం మాది అన్నారు. తీన్ మార్ సినిమా అప్పుడు , తీన్ మార్ మాదే అని గొడవ చేశారు, ఇప్పుడు రాంబాబు పై దాడి? సినిమా అనేది వినోదం కోసమే గానీ వివాదాల కోసం కాదు అని తెలుసుకోవాలి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more