ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్ 9 తరువాత తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ నుండి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బయటకు వెళ్ళతారట. తెంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం కుదరదని ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ని వీడిన తరువాత కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తు కార్యాచరణపై టీ కాంగ్రెస్ ఎంపీలు తర్జన భర్జన పడుతున్నారు. తెలంగాణ కోసం హైకమాండ్‌పై మరింత ఒత్తిడి పెంచడంపై దృష్టి పెడుతున్న వీరు... పార్లమెంట్‌లో విప్‌ను ధిక్కరించడంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. పార్టీని ఇప్పుడే వీడకుండా మరికొంత కాలం అధిష్ఠానంతో పోరాడాలకుంటున్న టీ కాంగ్ ఎంపీలు.. తెలంగాణ ఫ్రంట్ ఏర్పాటుపై కూడా కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీ కాంగ్ ఎంపీలు మల్లగుల్లాలు పడుతున్నారు. డిసెంబర్ తొమ్మిదిలోగా తెలంగాణ ఇవ్వకపోతే పార్టీని వీడతామంటూ హై కమాండ్‌కు అల్టిమేటం ఇవ్వాలనుకున్న ఎంపీలిపుడు తొందరపడరాదనుకుంటున్నారు. రాత్రి రెండు దఫాలుగా మధుయాష్కి, వివేక్ నివాసంలో జరిపిన భేటీల్లో.. ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేశారు. అయితే FDI అంశంపై లోక్‌సభలో ఓటింగ్ జరిగితే విప్‌ను ధిక్కరించడంపై ఎంపీలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. గతంలోనూ పార్లమెంట్ సమావేశాలు స్థంభింపజేసిన ఎంపీలు .. అవసరమైతే ఓటింగ్‌లో ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇప్పుడుకూడా అదే ధోరణి అవలంభించనున్నట్టు సమాచారం.
తెలంగాణ ఇస్తున్నట్టు డిసెంబర్ 9లోగా ప్రకటన చేయకపోతే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలనే అంశంపై నేతలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమి ఖాయమని నేతలంగీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులుండవని.... టిఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న కేసిఆర్ ప్రకటన..కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న టీ-కాంగ్ ఎంపీలను.. కలవర పరుస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడి బయటకు రావడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ.. టిఆర్‌ఎస్‌లో చేరడానికి మాత్రం విముఖంగా ఉన్నారని నేతలంటున్నారు. కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి జానారెడ్డితో సుధీర్ఘ మంతనాలు జరపడం ... ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు కెకెతో చర్చించడం.... పిమ్మట కేసిఆర్ నివాసానికి వెళ్లి కెకె భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ వాదులందరినీ కలుపుకుని ఒక పొలిటికల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి .. వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలన్న అంశాన్నే వీరు చర్చించినట్టు సమాచారం.ఫ్రంట్‌గా ఏర్పడకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వాదుల ఓట్లు చీలడం ద్వారా...టిఆర్‌ఎస్ కూడా నష్టపోతుందని.... ఇతరులు లబ్ది పొందుతారని కేసిఆర్‌కు కెకె వివరించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసే కొత్త పార్టీకి నాయకత్వం ఎవరు వహిస్తారనే అంశమే ఇపుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి జానారెడ్డి ముందుకు వస్తేనే కొత్త పార్టీ సాధ్యమవుతుందని.... లేదంటే టి-కాంగ్ నేతలంతా ఎవరి దారి వారే చేసుకుంటారనేది కాంగ్రెస్ వర్గాల అంచనా. అయితే టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు మాత్రం కొత్త కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 తరువాత కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వనంటే.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిసి కొత్త పార్టీ పెడితే తెలంగాణలో పోటీ చేస్తే.. టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? అనే ఆలోచనలు కేసిఆర్ కలవరపెడతున్నాయాని పార్టీ వర్గాలు అంటున్నాయి .
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more