మహాకవి ..గురజాడ అప్పారావు జయంతి. నవయుగ వైతాళికుడు.. విజయనగరం పట్టణానికి సాహితీ ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని కల్పించిన మహాకవి.. గురజాడ అప్పారావు మనసుపడి నిర్మించుకున్న ఇల్లు ఇది! 97 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఇల్లు.. ఇప్పుడు విక్రయానికి సిద్ధమైంది. ఆర్థిక స్థోమత సరిగాలేని గురజాడ వంశీకులు.. వందేళ్లకు దగ్గరైన ఈ ఇంటిని అమ్మే ఆలోచనలో ఉన్నారు. విజయనగరం పట్టణంలోని కోట సమీపంలో ఉన్న గురజాడ గృహం గురించి అందరికీ ప్రముఖంగా తెలుసు.ఆయన విజయనగరంలో వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ మహారాజావారి కోటకు రాకపోకలు సాగించడంలో తనకు కలుగుతున్న అసౌకర్యాన్ని మహారాజావారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పన్నుల వసూళ్ల ఖానా నిమిత్తం నిర్మించిన ఇంటిని గురజాడకు ఇచ్చారు. గురజాడ అందులోనే నివాసం ఉంటూ.. తన రచనలన్నీ ఆ ఇంటిలోనే సాగించారు. ఆ సమయంలోనే ఆయనకు నూతన గృహాన్ని నిర్మించుకోవాలన్న సంకల్పం కలిగింది. తన మనసులోని కోరికను నాటి మహారాజు ముందు అవిష్కరించారు. అప్పటి వరకూ గురజాడ నివాసం ఉన్న ఇంటికి పక్కనే ఖాళీగా ఉన్న స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం మహారాజు కేటాయించారు. నాటి మహారాణి లలితాదేవి ఈ ఇంటి నిర్మాణానికి ఇతోధికంగా సహకరించారు. నిర్మాణానికి కావాల్సినవాటన్నిటినీ కోట నుంచే తీసుకోమని ఔదార్యం చూపారు.
ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మహారాణి పేరిట 'లలిత్' అని పేరు పెట్టి 1915లో గృహప్రవేశం చేశారు. ఆ ఇంటిని తన రచనల భాండాగారంగా మార్చుకోవాలని గురజాడ ఎన్నో కలలు కన్నారు. అందుకు అనుగుణంగానే నిర్మించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ గృహప్రవేశం జరిగిన కొన్నాళ్లకే ఆయన పరమపదించారు. 2015 నాటికి శతవసంతాలు పూర్తి చేసుకోనున్న ఈ గృహంలో.. గురజాడ మునిమనవడి భార్య సరోజిని తన కొడుకు, కోడలితో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఈ గృహం శిథిలావస్థకు చేరినందున ఇందులో నివాసానికి భయపడుతున్నామని సరోజిని తెలిపారు. అందుకే దీనిని విక్రయించే యోచనలో ఉన్నామన్నారు. ప్రభుత్వం ఈ ఇంటిని కొనుగోలుచేస్తే, తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే.. ఈ గృహానికి తగిన వెల చెల్లిస్తేనే ప్రభుత్వానికి విక్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు. లేదంటే ప్రైవేటు వ్యక్తులకే విక్రయిస్తామని చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఇంటాక్ సంస్థ ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వానికి దీనిపై లేఖ రాసినట్టు సమాచారం. ఈ ఇంటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, దానిని గురజాడ స్మారకంగా తీర్చిదిద్దే విషయాన్ని పరిశీలించాలని వారు లేఖలో కోరినట్టు తెలియవచ్చింది. దీనికి బదులుగా ఈ ఇంటిలో నివాసం ఉంటున్నవారికి పట్టణంలోని వేరేచోట అన్ని వసతులతో కూడిన ఇల్లు కట్టి ఇస్తే బాగుంటుందని వారు ప్రతిపాదించినట్టు.. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ లేఖ విషయం తనకు తెలియదని సరోజిని చెబుతున్నారు. అయినప్పటికీ, అందులోని ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యమేనని ఆమె చెప్పారు. ఈ ఇంటికి వెనుకభాగాన తమకు సొంత స్థలం ఉందని అందులో కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి అభ్యంతరం లేదని ఆమె అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more