మన రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం కన్నా ఎక్కువగా, తాము పదవులు ఏవిధంగా పొందాలని ఆలోచిస్తుంటారు. ఈ కోవలోకి వారు వీరు అని కాకుండా అన్ని పార్టీల నాయకులు వస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు ఏ క్షణాన ఏ మలుపు చెప్పలేని పరిస్థితి. వైయస్ రాజశేఖర్ రెడ్డి పోయిన తరువాత గాడి తప్పిన పాలన ఇప్పటివరకు కూడా గాడిలో పడలేదు. ఇక నిత్యం ముఖ్యమంత్రి, పీసీసీ మార్పులు అంటూ వచ్చే వార్తలకు అయితే లెక్కే లేదు. ఇలాంటి గాలి వార్తలను ఆధారంగా చేసుకొని పదవి పొందటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో కేవీపీ రామచంద్రారావు కూడా ఒక్కడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఆత్మబంధువుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ కేవీపీ రామచంద్ర రావు తాజాగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల భోగట్టా. ఇందుకోసం ఆయన సీమాం ధ్ర ఎంపీలతో కలసి భారీ లాబీయింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడ్ని మార్చితే... ఈ జాబితాలో భట్టి విక్కమార్క, రాంనారాయణ రెడ్డి లాంటి వారి పేర్లు వినబడుతున్నా, ఒకప్పుడు ఒంటి చేత్తో రాష్ట్ర రాజకీయాలను నడిపించిన ఆయన తెర వెనుక తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా పీసీసీ అధ్యక్ష పదవి తనకు కట్టబెడితే.... 2014 వరకు తెలంగాణ అంశాన్ని లేవనెత్తకుండా చూసుకునే బాధ్యత నాదేనంటూ అధిష్టానానికి భోరోసా ఇస్తున్నాడట. వైయస్ మరణం తరువాత నుండి మౌనంగా ఉంటున్న కేవీపీ పీసీసీ పదవి దక్కించుకొని మళ్లీ తన హవా కొనసాగించడానికి పావులు కదుపుతున్నాడని అంటున్నారు. ఇటు కేవీపీ కాకుండా అటు ఆయన విధేయులు కూడా రాహుల్ గాంధీ తో కూడా మంతనాలు జరుపుతున్నారట. మరి అధిష్టానం కేవీపీ చేస్తున్న ప్రయత్నాలకు కరుణించి పదవి కట్టబెడుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more