అనంతపురంలో మళ్లీ రక్త చరిత్ర మొదలవుతుంది. ఫ్యాక్షనిజం మళ్లీ బుసలుకొడుతుంది. మూడో తరం యువత కూడా ఫ్యాక్షనిజం అనే పులి పై స్వారీ చేయటానికి సిద్దమవుతున్నారు. పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ పై అక్రమ ఆయుధాల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అనంతపురంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంట్లో తనిఖీలు చేయటం చేసిన విషయం తెలిసిందే. అయితే పరిటాల సునీత ఈ తనిఖీలపై తీవ్రంగా స్పందించారు. ఒక మహిళ ఎమ్మెల్యే ఇంట్లో అర్థరాత్రి తనిఖీలు చేయటం ఏమిటి? పర్మిషన్ లేకుండా పోలీసులు తనిఖీలు చేయటం పై టీడీపీ నాయుకులు మండిపడుతున్నారు. గతంలో కూడా పరిటాల రవి ని కూడా ఇలాగే తనిఖీల పేరుతో వేధించి , ఒక నెల తరువాత రవిని హత్య చేశారు. ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుందని ఆమె ఆవేశంగా అన్నారు. కానీ పోలీసులు తన ఇంటిలో తనిఖీలు జరపడంపై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. తన కుమారుడు చేసిన నేరమేమిటో వెల్లడిస్తే తానే అప్పగిస్తానని అన్నారు. అనంతపురం నగరంలోని అరవిందనగర్‌లో ఉన్న ఇంటిలో జరిగిన పోలీసు తనిఖీల నేపథ్యంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అవసరమైతే శ్రీరాంను తానే విచారణకు తీసుకువస్తానని తెలిపారు. కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి హత్యకు కుట్ర పన్నారన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. తన కుమారుడికి ఏ పాపం తెలీదన్నారు.
రాజకీయ కుట్రలోభాగంగానే కేసులో ఇరికించారన్నారు. తనకు ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి పూట తన ఇంట్లో సోదాలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఒక మహిళా శాసనసభ్యురాలినన్న కనీస గౌరవం కూడా లేకుండా సోదాలు నిర్వహించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. దీనిపై తాను అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. ఓ మహిళా ప్రతినిధి రాష్ట్ర హోంమంత్రిగా ఉండగా సాటి మహిళా ఎమ్మెల్యేనైన తన ఇంటిపై ఆకస్మికంగా పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించడం విచారకరమన్నారు. గతంలో పరిటాల హత్యకు ముందు ఇదే మాదిరిగా తమ ఇంట్లో అర్ధరాత్రి పూట సోదాలు నిర్వహించి తమను మానసికంగా వేధింపులకు గురి చేశారన్నారు. ఆ వెంటనే పరిటాల రవీంద్రను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే తనకు అనుమానం కలుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నా కొడుకుబాగా చదువుకుంటున్నారు. వారు ఇలాంటి గొడవలకు దూరంగా ఉన్నారు. విదేశి చదువుల కోసం శ్రీరాం రెడీ అవుతున్నాడని, తర్వలో విదేశాలకు వెళ్లాతాడని సునీత చెప్పారు. కేవలం శ్రీరాం పై కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more