కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేశారు. ‘మా పార్టీలోనే సామాజిక న్యాయం కొరవడింది..’ అని వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. విహెచ్‌కు ఇటీవల వీరమణి అవార్డు లభించిన నేపథ్యంలో ఒబిసి మేధావుల సంఘం నగరంలోని జూబ్లీహాలులో సన్మాన సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రతినిధులుగా వెళ్ళారని, సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని దుయ్యబట్టారు. తమ పార్టీలోనే ఇలా ఉందని ఆయన అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యాంగం ద్వారా అధికారాలు లభించినట్లు బిసిలకూ లభించినప్పుడే బిసిలు అభివృద్ధి చెందుతారని అన్నారు. బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించినా, అందులో ఆరు శాతం కూడా అమలు కావడం లేదని అన్నారు. బిసి కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని ఆయన తెలిపారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని ఆయన చెప్పారు. అగ్రకులాల వారు చాలా స్పీడుగా ఉంటారని, బిసి కులాలు ముందుకు వెళ్ళకుండా ఏదో రకంగా ముడిపెడుతుంటారని ఆయన విమర్శించారు. తమ పార్టీలోనే తనను వెనక్కి లాగారని ఆయన తెలిపారు.
కాబట్టి బిసిలు విభేదాలు వీడి ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు తమిళనాడుకు చెందిన సంస్ధ ద్వారా వీరమణి అవార్డు రావడం మంత్రి పదవి కంటే పెద్దదని విహెచ్ అన్నారు. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 26 కులాలను బిసిల జాబితాలో చేర్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. బిసిలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని ఆమె తెలిపారు. విహెచ్ పార్టీకి, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడని ఆమె చెప్పారు. విహెచ్ ఎప్పుడైనా వాస్తవాలే చెబుతారని, వాస్తవాలు చెబితే తనకు వ్యతిరేకత పెరుగుతుందేమోనని ఆలోచించబోరని అన్నారు. పార్లమెంట్ ఒబిసి చైర్మన్‌గా ఉన్న విహెచ్ ఏదైనా రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగాల నియామకాల్లో బిసిల రిజర్వేషన్లు ఖచ్చితంగా పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆమె చెప్పారు. జాతీయ బిసి కమిషన్ చైర్మన్ ఎంఎన్ రావు మాట్లాడుతూ హర్యానా, మహారాష్టల్రో బిసి కమిషన్ చైర్మన్లను అగ్ర కులాల వారిని నియమించారని తెలిపారు. ఎస్‌సి, మైనారిటీ కమిషన్ల చైర్మన్లను అగ్రకులాల వారిని ప్రభుత్వాలు నియమించగలవా? అని ఆయన ప్రశ్నించారు. విహెచ్ భవిష్యత్తులో సిఎం అవుతారని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ప్రసంగిస్తూ త్వరలో ఏర్పాటు చేయబోయే బిసి కమిషన్‌కు తప్పని సరిగా బిసినే చైర్మన్‌గా నియమిస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more