పాక్ సైనికులు భారత్ ను రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారు. పాకిస్తానీ సైనికులు జమ్మూ- కాశ్మీర్ లోని పూంచ్ రంగంలోకి సరిహద్దును దాటి , భారత భూభాగంలోకి ప్రవేశించి , గస్తీ తిరుగుతున్న ఇద్దరు భారత సైనికులపై క్రూరంగా మెరుపుదాది చేసి చంపారు. పాకిస్తాన్ సైన్యం అధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి గస్తీ నిర్వహిస్తున్న సైనిక బృందంపై దాడి చేయడమే కాకుండా ఇద్దరు జవాన్లను తలనరికి చంపేసింది. పూంఛ్ జిల్లాలోని అధీన రేఖ వద్ద ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తానీ సైన్యం సుమారు వంద మీటర్లమేర భారత భూభాగంలోకి చొరబడి గస్తీ బృందంపై దాడికి పాల్పడింది. లాన్స్‌నాయక్‌లు హేమరాజ్, సుధాకర్ సింగ్‌లను చంపేయడమే కాకుండా మరో ఇద్దరు జవాన్లను గాయపర్చారు. గస్తీ బృందంపై దాడి చేసిన పాకిస్తాన్ సైనికులు ఇద్దరి తలలు నరికేసారని, వాటిలో ఒకదాన్ని తమ వెంట తీసుకెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇద్దరు చనిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన సైన్యం మాత్రం వారి తలలు నరికేసారన్న వార్తలను ధ్రువీకరించలేదు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం పాకిస్తాన్ సైన్యానికి చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ (బిఏటి) పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడి దాడులకు పాల్పడింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తానీ సైన్యం వరసగా పాల్పడుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలు, మిలిటెంట్లను చొప్పించే ప్రయత్నాల్లో ఇది ‘అత్యంత తీవ్రమైన’ ఘటనగా ఉధంపూర్‌లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పాక్ సైన్యానికి చెందిన కొంతమంది సైనికులు మెంధార్ సెక్టార్‌లో మన భూభాగంలోకి చొరబడ్డారు. దట్టమైన పొగమంచు పరిస్థితులను సాకుగా తీసుకుని వారు మన పోస్టుల వైపు రావడం గమనించి అప్రమత్తమైన ఆ ప్రాంతంలోని గస్తీ బృందం వారిని నిలువరించింది. దరిమిలా ఇరుపక్షాల మధ్య దాదాపు అరగంట సేపు కాల్పుల అనంతరం చొరబాటుదారులు అధీన రేఖకు ఆవలి వైపున ఉన్న తమ పోస్టుల వైపునకు పలాయనం చిత్తగించారు. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు లాన్స్‌నాయక్ హేమరాజ్, లాన్స్‌నాయక్ సుధాకర్ సింగ్‌లు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆ ప్రకటన పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more