తెలంగాణపై ప్రకటనకు ఇక కొద్దిరోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ‘కీలక నిర్ణయం’ ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే విషయంలో తాను అఖిలపక్షంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన తరువాత కొద్ది సమయంలోనే కాంగ్రెస్ సీనియర్లు వార్ రూంకు చేరుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. తల్‌కటోరా రోడ్డులోని వార్ రూంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోం మంత్రి షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన గులాం నబీ ఆజాద్‌లతోపాటు అహ్మద్ పటేల్ కూడా కీలక సమావేశంలో పాల్గొన్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ కూడా హాజరైనట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటనకు ముందు జరపాల్సిన కసరత్తుకు సంబంధించి మరోసారి వారు చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంతో పాటు రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఈ నెల 18 నుండి రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ మేధోమథనం, మూడో రోజు జరుగనున్న ఎఐసిసి సమావేశం ఏర్పాట్ల గురించి కూడా కాంగ్రెస్ వార్ రూం సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ వార్ రూంలో సమావేశానికి ముందు గులాం నబీ ఆజాద్ 10 జన్‌పథ్‌కు వెళ్లి సోనియా గాంధీని కలుసుకోవటం గమనార్హం. ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 28 తేదీలోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తారని షిండే సమావేశంలో చెప్పిన కొద్ది గంటలకే కాంగ్రెస్ వార్ రూంలో పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జరగటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెండు ప్రతిపాదనలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధికి రాజ్యాంగ ప్రతిపత్తితో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయటంతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించటం ఒకటైతే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు పూనుకోవటం. ఇదే చేయవలసి వస్తే హైదరాబాదును కొంత కాలం పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయటం పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు టిఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, పార్లమెంటు సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే, సీమాంధ్ర నాయకులు మాత్రం తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప రాష్ట్ర విభజన చేయవద్దని వాదించటం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం ఇరుపక్షాల వాదనలతో పాటు ప్రత్యేక దూతల ద్వారా తెప్పింకుకున్న సమాచారాన్ని క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే పక్షంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉంటాయి? రాష్ట్ర విభజన ప్రతిపాదనను చేపట్టే పక్షంలో సీమాంధ్రలో కాంగ్రెస్ స్థితిగతులు ఏమిటి? వంటి అంశాలతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్‌మోహన్ రెడ్డి పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందనీ, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం తెలంగాణలోనైనా పదిహేను సీట్లు గెలుచుకోవచ్చునంటూ టి ఎంపీలు చేస్తున్న వాదన ఎంత వరకు నిజమనేది కూడాఅధిష్ఠానం పరిశీలిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ వార్ రూంలో సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇలాంటి పలు అంశాలపై లోతుగా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణాపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో నెలకొనే శాంతి భద్రతల పరిస్థితి ఏమిటనేది కూడా అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more