తెలంగాణ కన్ ప్యూజన్ ఇంకెంతకాలం? ఎంతకాలం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఈ కన్ ప్యూజన్ తో రాష్ట్ర ప్రజల నరాలు తెగే టెన్షన్ పడుతున్నారు. ఇలాగే చేస్తే పెద్ద నష్టం జరుగుతుంది. కన్విన్స్ చేయండి ? అదీ చేతకాకపోతే కన్ ప్యూజ్ చేయకండి? తెలంగాణ పై ఏదో ఒకటి త్వరగా తేల్చండి? ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలే ఆ ప్రజలనే కన్విన్స్ చేయలేక అనేక సంవత్సరాల నుండి కన్ ప్యూజ్ చేస్తున్నాయి. తెలంగాణ సమస్య విషయంలో కేంద్ర పాలకుల వ్యవహార శైలికి ఇది అద్దంపడుతున్నది. ఒక రోజు కాదు , ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏళ్లతరబడి తెలంగాణ విషయాన్ని తేల్చకుండా నాన్చి.. నాన్చి ఎవరి ఊహలకు వారిని వదిలి పెట్టి తమాషా చూస్తున్నా హస్తిన పెద్దలు. తెలంగాణ సమస్య సున్నితమైన, జఠిలమైన సమస్యకావచ్చు. కానీ ఈ సమస్యలో ఎన్నో విడదీయలేని చిక్కు మూడులు ఉండి ఉండవచ్చు, కానీ ఎలాంటి సమస్యకైనా ఒక నిర్ణత సమయం, ఒక హద్దు, ఒక పరమితి, ఒక మార్గం ఉంటుంది. అయితే ఆవేమీ పట్టించుకోకుండా హాస్తిన పెద్దలు తాంబూళాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఆంద్రప్రదేశ్ ప్రజలపై వ్యవహరిస్తున్నారు. అసలు తెలంగాణ ఇస్తామని చెప్పరు. తెలంగాణ ఇవ్వకపోవటానికి గల కారణం వల్ల ఇవ్వలేకపోతున్నం అని చెప్పారు. మౌనంతో హస్తిన ప్రజలు మజా చేస్తున్నారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ , ఆ తరువాత వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం భారీగా దెబ్బతిన్నది. ఈ ఉద్యమాలతో రాష్ట్రంలో వందలాది మంది యువకులు ప్రాణాలు త్యాగం చేశారు. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అయితే అప్పుడు తాత్కాలికంగా సమస్య తగ్గిపోయినా ప్రజల్లో మాత్రం అది రగులుతూనే .. నివురుగప్పిన నిప్పుల కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే గత పది సంవత్సరాలకు పైగా తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ఇప్పటికి వెయ్యి మందికి పైగా యువకులు ఆత్మత్యాగం చేశారు. సకల జనుల సమ్మెతో పాటు జరిగిన, జరుగుతున్న నిరసన ధ్వనులు తెలంగాణ ప్రాంతం అంతా మారుమోగుతున్నాయి. అయితే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎందరి నాయకులలో ఈ సమస్య పట్ల త్రికరణ శుద్ది ఉందో లేదో ఏమో కానీ తెలంగాణ ప్రాంత ప్రజల్లో మాత్రం ఈ సెంటిమెంట్ ప్రగాఢంగా ఉందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప న్యాయం జరగదని అధికశాతం తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఎలాంటి నాయకుడు తెలంగాణ కోసం పిలుపు ఇచ్చినా ప్రజలు తరలివస్తున్నారు. నాయకుడు ముఖ్యం కాదు , తెలంగాణ ముఖ్యం అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ సమస్య జటిలమవుతున్న తరుణంలో కేంద్రలోని నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎక్కడి తెలంగాణ? ఏమి తెలంగాణ? అంటూ బాధ్యతా రహిత్యంగా మాట్లాడాతున్నారు. నోరు నవ్వుతుంటే నొసలు వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. దీనికైనా ఒక పద్దతి ఉంటుంది. ఒక మార్గం ఉంటుంది. మంచి చెడులు ఆలోచించి సీనియర్ నాయకులు మాట్లాడాలి. అంతేకాని నోరు ఉందికద అని సూటిగా చెప్పడం, వ్యంగ్యంగా, వెటకారంగా , హేళనగా మాట్లాడే నాయకులను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. మంచికో.. చేడుకో మొన్న 28న ఒక కేంద్ర మంత్రి ఒక మాటఇచ్చారు. అఖిల పక్షం జరిగిన తరువాత నెల రోజుల సమయం తీసుకోని త్వరలో నిర్ణయం చెబుతానని చెప్పాడు. ఈ ప్రకటన ద్వారా కూడా రాష్ట్రంలో గందరగోళం స్రుష్టించారు. ఏదిఏమయితేనేని సమస్యకు పరిస్కారం దొరుకుతుందనే కొందరైనా విశ్వసిస్తున్నా దశలో మళ్లీ రాష్ట్రంలో ఉద్రికత్త పెంచుతున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు ప్రాంతాల వారీగా విడిపోయారు. సైకిల్ పార్టీ మాత్రం తన రెండు చక్రాల సిద్దాందం వదిలిపెట్టి, సింగిల్ హ్యాండిల్ మీద డ్రైవ్ చేస్తూ మేము తెలంగాణకు వ్యతిరేకంకాదని లేఖ ద్వారా చెప్పటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకున్న విధంగానే సైకిల్ ఒక చక్రంలో గాలి తీశారు. ఆ పార్టీ రెండు చీలిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగానే సైకిల్ పార్టీ లో పచ్చ చొక్క నాయకులు వీడిపోయే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద సైకిల్ పార్టీ బలహీనపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా సైకిల్ పార్టీకి గాలి తీయ్యటం వలన కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టం జరిగే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. గత వారంలో రోజుల నుండి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మద్య మాటల యుద్దం జరుగుతంది. మాటలు అదుపుతప్పి వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రావచ్చని కొంతమంది నాయకులు వెల్లడిస్తున్నారు.
మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయరని బల్లగుద్ది మరి చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల్లోని మరో ప్రాంతం నాయకులు రాయల తెలంగాణ వస్తుందని వారు చెబతున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమని మరి కొంతమంది నాయకులు అంటున్నారు. ఇలా ఎవరికి తోసినట్లు వారు బఫే మాదిరి వడ్డిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ నాయకులు మాటల్లు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో తెలియాక కన్ ప్యూజ్ లో పడిపోతున్నారు. ఇలా మాట్లాడుతున్న నాయకులపై కాంగ్రెస్ అధిష్టానం కట్టడి కూడా చేసే ప్రయత్నం చేయటం లేదు. కనీసం మందలించటం కూడా చెయ్యదు. తెలంగాణ పై మేం నిర్ణయం చేస్తున్నాం, అప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరు నోరు విప్పొద్దని కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది? ఇలా మాట్లాడి ప్రజలను కన్ ప్యూజన్ చేస్తున్నారు. ఇలాంటి నాయకులను ప్రజలే ఎన్నుకున్నారు. ఇప్పుడ ప్రజలనే కన్ ప్యూజన్ చూస్తున్నారు. ఇలా ఎంతకాలం ప్రజలను కన్ ప్యూజ్ చేస్తారు? కొంతమందిని నమ్మిచ్చి కొంతకాలం మోసం చేయచ్చు. అదే సూత్రం రాష్ట్ర ప్రజలందరికి అప్లయ్ చేస్తే మాత్రం నాయకులు తీవ్రంగా నష్టపోతారు. అప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కన్ ప్యూజన్ త్వరలో తెర పడాలని కోరుకుందాం..? రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలు చూసి, ఆత్మహత్యలు చేసుకుంటున్న లేత వయసు విద్యార్థులను ఆత్మఘోష చూసి, వయసుకు వచ్చిన పిల్లలు తెలంగాణ పేరిట ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసి, ఆ బాధతో బతికనంతకాలం నలిగిపోతున్న అమ్మ నాన్నల జీవితాల్లోకి తొంగి చూసి, ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఈ కన్ ప్యూజన్ అంటూ రాయటం జరిగింది? ఇకనైన ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి నాయకులారా....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more