1971లో 'హల్‌చల్ ', 'హంగామా' సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన జీనత్.. 'హరే రామ హరే కృష్ణ' సినిమాతో రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. బాలీవుడ్ లో "దమ్ మారో దమ్..'', "చురాలియా హై తుమ్‌నేజో దిల్‌కో..'' అంటూ అప్పటి ఒకతరం ప్రేక్షకుల్ని తన హొయలతో ఉర్రూతలూగించిన బ్యూటీ జీనత్ అమన్ గుర్తుందా ? ఈ అమ్మడుని అంత తొందరగా మరచిపోరు సినీ జనాలు. ఇప్పుడు ఈ అమ్మడు వయస్సు 60 సంవత్సరాలు. ఈ వయస్సు అయిపోయిన బ్యూటీ గురించి ఎందుకనుకుంటున్నారా ? వయస్సు అరవై అయినా, అందం మాత్రం ఇరవయ్యే. ఏమాత్రం చెక్కుచెదరని ఈ ఆంటీకి ఇప్పుడు కోరికలు కలిగాయి. అదే పెళ్ళి చేసుకోవాలని. జీనత్ అమన్ (62) లేటు వయసులో మళ్లీ పెళ్లికి సిద్ధమైంది. మరి ఈమెకు పెళ్ళి కాలేదా అంటే అయింది. 1985లో సహనటుడు మజర్‌ఖాన్‌ను వివాహం చేసుకుంది.ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా. ఆ పిల్లల వయస్సు ఒకరికి 26 ఏళ్ళు, మరొకరికి 23 ఏళ్ళు.
1998 మఝర్ ఖాన్ చనిపోయాడు. ఆ తరువాత నుండి ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఈ అందాల సుందరిని ఓ 36 ఏళ్ళ యువకుడి పై మనసు పారేసుకుంది. మనస్సు పారేసుకోవడమే కాదు... మనువు ఆడబోతుంది కూడా. తనకన్నా 26 ఏళ్లు చిన్నవాడైన ముంబై వ్యాపార వేత్తతో ఏడడుగులు నడవబోతోంది. తాను ముంబైకి చెందిన వ్యాపారవేత్త అని, తాను భారతీయుడేనని చెప్పిన ఈమె ఈ విషయాన్ని తన పిల్లలతో చెబితే... తన నిర్ణయానికి వారెంతో ఆనందించారని వివరించింది. అయితే ఇంత లేటువయస్సులో కూడా ఈమెకు ఇంకా కోరికలు చావలేదని బాలీవుడ్ జనం అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more