చేతిలో సెల్ పోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఒక్క సెకనులో తెలిసిపోతుంది. సెల్ ఫోన్ తో మనకు అవసరమైన అన్ని పనులు ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. సెల్ ఫోన్ దూకుడు ముందు మనిషి కూడా పరిగెత్తలేడు అనేది తెలుస్తోంది. అయితే ఈ సెల్ ఫోనే అనేక మంది జీవితాల్లో చీకటి నింపుతుంది. అనేక మందిని దొంగలుగా, హంతకులుగా, మార్చుతుంది. ప్రజల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చివేస్తుంది. ఒక్క సెల్ ఫోన్ తో రాష్ట్రంలో ఉన్న వీఐపీలకు నెల రోజుల పాటు కంటీ మీద కునుకు లేకుండా చేశాడు ఒక కారు డ్రైవర్. ఇతను రాత్రి పూట మాత్రం వీఐపీలను టార్గెట్ గా పెట్టుకుంటాడు. మెదక్ జిల్లా చిన్న కోడూరుకు చెందిన క్రిష్ణ హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేటు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. ఓ కుమార్తె కూడా ఉంది. అయితే క్రిష్ణ కాపురంలో కలతలు రావడంతో కొన్నేళ్ల క్రితం కుమార్తెను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో కొన్నాళ్ల క్రితం క్రిష్ణకు బావమరిది నుంచి ఓ బెదిరింపు ఎస్సెమ్మెస్ వచ్చింది. దీనిపై భయపడిన క్రిష్ణ వెంటనే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్రిష్ణ మైండ్ లో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇలాంటి సందేశాలు ఎవరికి పంపినా పోలీసులు పట్టించుకోరని క్రిష్ణ భావించాడు. వెంటనే క్రిష్ణ మెరుపు వేగంతో దూకుడు పెంచాడు. గత సంవత్సరం నవంబర్ లో తాడ్ బండ్ ప్రాంతంలో దొరికిన సెల్ పోన్ తో ప్రముఖులకు అసభ్య సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. వీఐపీ నెంబర్లను ఇంటర్ నెట్ నుంచి సేకరించేవాడు. గత నెల రోజులుగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు అసభ్య సందేశాలు పంపి తన చేతి ఆనందం తీర్చుకునే వాడు. అయితే ఇదేం పని అని బాధితుల తరపున ఎవరైనా క్రిష్ణ కు ఫోన్ చేసి అడిగితే .. వారి నెంబర్ కూడా అసభ్య సందేశాలు పంపేవాడు. అంతేకాకుండా మిస్డ్ కాల్స్ ఇచ్చి శునకానందం పొందేవాడు. క్రిష్ణ అసభ్య సందేశాలకు మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 57 మంది ప్రముఖులకు క్రిష్ణ రొమన్స్ బాణాలు పంపేవాడు.
అయితే క్రిష్ణ వలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఆడ, మగ అనే తేడా లేకుండా క్రిష్ణ బూతు సందేశాలు పంపేవాడు. అయితే కొంత మంది క్రిష్ణ పంపించే బూతు సందేశాలకు భయపడి సెల్ పోన్లు స్విచాఫ్ చేసేవారట. అయితే ఇటీవల అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అలాగే అందరు క్రిష్ణ పంపించే అసభ్య సందేశాలను లైటుగా తీసుకోలేరని నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే నిరూపించారు. క్రిష్ణ రోజు మాదిరిగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధకు బూతు సందేశాలు రావటంతో జయసుధ షాక్ కు గురైంది. వెంటనే తన వ్యక్తి గత కార్యదర్శికి ఈ విషయం చెప్పటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇదే విధంగా మరికొంతమంది ప్రజాప్రతినిధులూ మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసభ్య మెసేజ్ లు పంపింస్తున్న సెల్ ఫోన్ నంబర్ , ఇతర ఆధారాలతో సాయంతో క్రిష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పంపించిన మెసేజ్ లను ప్రింట్ తీయగా దాదాపు 100 పేజీలు వచ్చాయి. ఆ బూతు మెసేజ్ లు చదివిన పోలీసులు షాక్ తిన్నారు. ఎక్కడ దొరకని బూతు పదాలు, రొమాన్స్ పదాలు, ఆ వంద పేజీలలో దాగి ఉన్నాయాని పోలీసులు అంటున్నారు. ఇలా చేయటం వెనుక క్రిష్ణ ఒక కారణం చెబుతున్నాడు. రాత్రి ఇంటికి చేరగానే భార్య, కుమార్తె గుర్తుకొస్తారు. వారిని మర్చిపోవడానికి, నిద్రపోయే వరకు ఈ అసభ్య సందేశాలను పనిగా పెట్టుకున్నట్లు క్రిష్ణ పోలీసు విచారణలో చెప్పటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more