గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెకంటేశ్వర రావు (నాని) మరోసారి సంచలనానికి తెరతీశారు. ఏకంగా తెలుగు తమ్ముళ్ల పై పిడిగుద్దులు కురిపించారు. ఇదంత చంద్రబాబు పాదయాత్ర గుడివాడలో జరుగుతుండగా జరగడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన గుడివాడలో సంచలనమైంది. పర్యవసానంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున్న మోహకరించి, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు వస్తున్న మీ కో్సం పాదయాత్ర రెండో విడత క్రిష్ణా జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారీస్థాయిలో జనసమీకరణకు ఆ పార్టీ శ్రేణులు కార్యాచరణ సిద్దం చేశారు. ఇదే క్రమంలో కొంతమంది యువత తమ బైక్ లను ర్యాలీగా పట్టణ వీధుల్లో తిప్పారు. అయితే ఎమ్మెల్యే నాని, తన స్నేహితుడు దుక్కిపాటి శశిభూషణ్ లో గుడివాడలోని శరత్ థియేటర్ వెళ్లారు. ఈ థియేటర్ నానికి చెందినది కావడంతో ఆయన ప్రతిరోజు తన కార్యకాలపాలను ఇక్కడే నిర్వహిస్తారు. అయితే ఎమ్మెల్యే నాని వాహనం శరత్ థియేటర్ వైపు వెళ్లడాన్ని చచూసిన తెలుగు యువత ఆయనతో పాటు బైక్ ర్యాలీని అనుసరించారు. థియేటర్ లో బైక్ లను రౌండ్లు తిప్పుతూ తెలుగు దేశంపార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అప్పటి వరకూ సంయమనంతో ఉన్న నానిని దేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు మరింత రెచ్చగొట్టాయి.
దీంతో ఆవేశాన్ని ఆపుకోలేని నాని ఒక్క ఉదుటున దేశం పార్టీ కార్యకర్తలపై లంఘించారు. నాని ఆవేశంతో దూసుకురావడంతో దేశం పార్టీ కార్యకర్తలు పరారయ్యారు. అయితే ఒక వాహనం పై ఉన్న వారిని నాని కాలతో తన్నగా, వారు కింద పడిపోయారు. కిందపడిన వారి పై నాని పిడిగుద్దల వర్షం కురిపించారు. దీంతో దేశం పార్టీ కార్యకర్తలు తమ వాహనాన్ని విడిచి, సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ విషయం బయటకి తెలియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శరత్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. నానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మాత్రం సైలెంట్ గా పాదయాత్ర సాగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more