అలనాటి మేటి నటి జయప్రద నిన్న తన జన్మదినాన్ని తిరుమలేశుని సమక్షంలో గడిపారు. తెలుగులోనూ, హిందీలోనూ నటిగా పేరు తెచ్చుకుని, రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన జయప్రద కొన్నాళ్ళుగా తెలుగు నేలమీద రెండిటికీ దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా సేవ చేస్తున్న జయప్రద నిన్న తిరుపతిలో, తెలుగు రాజకీయాల్లోకి మరోసారి రావాలనుందన్న తన కోరికను వెలిబుచ్చారు. పదేళ్ళ తర్వాత తెలుగు రాజకీయ రంగంలో అడుగుపెడుతున్న తను మరో ఐదేళ్ళు తెలుగువారికి సేవ చెయ్యాలనుందని అన్నారు. దేవుడు వరాలివ్వటానికి తయారైతే, ఒకావిడ తనకోసం ఏమీ అడగలేదట. మా అత్తగారు బంగారపు ఉయ్యాలలో తన మనవడిని ఊపుతూ హాయిగా జీవించేట్టుగా వరమివ్వండి స్వామీ అని అడిగిందట. కానీ ఆ నిస్వార్ధపు కోరిక వెనక తన కొడుకు బంగారపు ఉయ్యాలలో ఊగటమంటే అది తన ఆస్తే కదా, అలాగే అత్తగారు ఊపుతుండాలంటే ఆమెకు అంత ఆరోగ్యం ఉండాలి, తనతో సఖ్యంగానూ ఉండాలి. బంగారపు ఉయ్యాల ఉండటమంటే ఆ స్థాయిలో మిగతావన్నీ ఉంటాయి కదా. తెలుగు వారికి సేవ చెయ్యాలీ, అది కూడా ఐదు సంవత్సరాలు చెయ్యాలి అంటే 2014 ఎన్నికల్లో తను ఎక్కడ నిలుచున్నా గెలవాలి, ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా, ప్రతిపక్షాలతో కానీ మిత్రపక్షాలతో కానీ ఎటువంటి ఆటంకాలు కలుగకూడదు. జన్మదినాన ఎంతో ప్రేమగా అడుగుతున్న జయప్రద కోరికను తిరుమలేశుడు కాదనగలడా చూద్దాం. అయితే తను ఏ రాజకీయ పార్టీ లో చేరేదీ ఈ నెల 30 కి చెప్తానని జయప్రద చెప్తోంది. కాకపోతే, వైయస్ ఆర్ లాంటి నాయకుడు తెలుగువాళ్ళకి చాలా అవసరమన్న తన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్న జయప్రద, అప్పటికల్లా రాజకీయ విశ్లేషణ బాగా చెయ్యవచ్చని, జగన్ విషయం కూడా తేలిపోవచ్చని భావిస్తున్నట్టుగా కనిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more