ప్రాణాలు రక్షించే ఔషధాల మీద పేటెంట్ హక్కులా? పైగా వాటి కొనసాగింపులు ! బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల ఉపశమనానికి వాడుతున్న స్విస్ కంపెనీ నోవార్టిస్ ఉత్పాదనలు గ్లివెక్ ని భారతదేశంలో 3 లక్షల మంది వాడుతున్నారని అంచనా. దీని ఖర్చు నెలకు లక్ష రూపాయల వరకూ పడుతుంది. కానీ దీర్ఘకాలంగా బాధపడుతున్న బ్లడ్ క్యాన్సర్ రోగులకు ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. విజయవంతంగా నడిచే మందులను నకలు చేస్తూ మరిన్ని మందులు మార్కెట్ లోకి రాకుండా ఉండటం కోసం ఐదు సంవత్సరాల పేటెంట్ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆయా సంస్థలు మందుల పాళాల్లో స్వల్ప మార్పులతో పేటెంట్ ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించటం కోసం చేసే ప్రయత్నం చేసి మరోసారి పేటెంట్ రిజిస్ట్రేషన్ కి వెళ్తారు. ఈ పద్ధతిని ఎవర్ గ్రీనింగ్ అంటారు. ఈ స్విస్ కంపెనీ కూడా అలాగే మోడిఫికేషన్ చేస్తూ పేటెంట్ కొనసాగింపు కోసం ప్రయత్నించగా పేటెంట్ కార్యాలయం దాన్ని తిరస్కరించింది. దానితో నోవార్టిస్ కంపెనీ చెన్నై ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బోర్డ్ గడప తొక్కింది. అక్కడా చుక్కెదురవటంతో స్విస్ సంస్థ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళకుండా నేరుగా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. కానీ ఈ రోజు సుప్రీం కోర్టు కూడా పేటెంట్ ని తిరస్కరించింది. కొత్తగా తయారు చేసామన్న ఔషధ గుణాలన్నీ పాత దానిలో కూడా ఉన్నాయని జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా దేశాయ్ ల ధర్మాసనం గమనించింది. కాకపోతే కొత్తగా తయారైన మందుకి త్వరగా కరిగిపోయే గుణముందన్న ఒక్క అంశంలో మాత్రమే ఇది నూతన లక్షణాన్ని తెలియజేస్తోంది కానీ దాని వలన చికిత్సలో ఎటువంటి ప్రయోజనమూ ఉన్నట్టుగా కనిపించటం లేదు. అందువల నోవార్టిస్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సంచలనాత్మకమైన ఈ తీర్పు ఎవర్ గ్రీనింగ్ విధానానికి స్వస్తి పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివలన ఔషధాలు చాలా తక్కువ ఖరీదులో లభ్యమయ్యే పరిస్థితి నెలకొంటుందని, ఈ జడ్జిమెంట్ ని ఉటంకిస్తూ భవిష్యత్తులో ఎవర్ గ్రీనింగ్ కి చెక్ పెట్టే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more