ఉరిశిక్షలను వెయ్యగూడదని ప్రపంచ మానవహక్కుల సంఘం అన్ని దేశాలను కోరుతున్న సమయంలో ఎంతోకాలంగా పక్కనపెట్టి ఉన్న క్షమాభిక్ష అర్జీలను తిరస్కరిస్తూ రాష్ట్రపతి వాటిని వెనక్కి పంపించటం, వాళ్ళంతా కోర్టులను ఆశ్రయించటంతో విషయం కాస్త సున్నితమైన అంశంగా తయారైంది.
ఆ కేసుల్లో మరీ పాతదైన దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ విషయంలో 1993 లో అతనికి మరణ శిక్ష విధించగా ఇప్పటివరకూ ఆ పని జరగలేదు, శిక్షనూ తగ్గించలేదు. దానితో అతను దినదినగండంగా గడుపుతూ వచ్చాడు. అది చాలా బాధాకరమైన పరిస్థితి అంటూ మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
రాష్ట్రపతి అతని క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, 20 సంవత్సరాలుగా శిక్షను అమలుపరచటంలో జాప్యం జరిగినందువలన కనీసం మరణశిక్షను జీవితఖైదులోకి మార్చమంటూ భుల్లార్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మీద వచ్చే తీర్పు చారిత్రాత్మకమై మరో 17 కేసులలో నిర్ణయం తేలికవుతుంది.
అయితే, దీన్నే మరోవిధంగా ఆలోచిస్తే న్యాయస్థానాలలో జాప్యమైన మాట వాస్తవమే కానీ, జాప్యం ఎందుకైందంటే మరణశిక్ష మీద తగ్గించమని కోరుతూ అర్జీల మీద అర్జీలు పెట్టుకోవటం కూడా ఇంత కాలం గడవటానికి దోహదం చేసింది.
ఖాలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ పేరుతో ఉగ్రవాద చర్యలకు పూనుకుని బాంబు దాడితో 9 మంది మరణానికి, 25 మంది గాయపడటానికి కారకుడైన భుల్లార్ కి 1993లో మరణ శిక్ష విధించిన తర్వాత భుల్లార్ 2001 లో ట్రయల్ కోర్టు, ఆ తర్వాత 2002 లో ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పుని సమర్ధించాయి. దానిమీద పునఃపరిశీలనకు పిటిషన్ వేస్తే అది కూడా తిరస్కరించబడింది. దరిమిలా శిక్ష తగ్గించమని వేసిన పిటిషన్ కూడా 2003 లో తిరస్కరించబడింది. 2003లోనే భుల్లార్ క్షమాభిక్షకోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు. అది ఎనిమిది సంవత్సరాల తర్వాత 2011 లో రాష్ట్రపతిచేత తిరస్కరించబడింది.
రాష్ట్రపతికి ఇచ్చిన క్షమాభిక్ష చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని, దానివలన భుల్లార్ మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, అందువలన భుల్లార్ శిక్షను తగ్గించమని సుప్రీం కోర్టుకి వెళ్తే, 2012 లో సుప్రీం కోర్టు దాని మీద తీర్పుని పెండింగ్ లో పెట్టింది. ఈరోజు జస్టిస్ జి.ఎస్ సింఘ్వి, జస్టిస్ ఎస్.జె. ముఖ్యోపాధ్యాయ ల ధర్మాసనం శిక్ష అమలులో జరిగిన జాప్యం వలన శిక్ష తగ్గింపుకి అర్హత లభించదని చెప్తూ అతని పిటిషన్ ని తిరస్కరించింది.
న్యాయస్థానంలోనూ రాష్ట్రపతి కార్యాలయంలోనూ జాప్యం జరిగిందన్నది వాస్తవమే కానీ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అంతటి ఉగ్రవాదికి కూడా అవకాశం ఇవ్వటం వలనే శిక్ష అమలులో జాప్యం జరిగింది. అదే ఆ అవకాశం లేకపోతే శిక్ష అమలుపరచటం ఇంతకాలం ఆగివుండేది కాదు. ఆలస్యం జరగటం వలన అతనికి కలిగిన మనోవేదనా సత్యమే, కానీ ఆలస్యం జరగటమనేది శిక్షను తగ్గించమని కోరటానికి ఆధారం కాజాలదు. ఎందుకంటే శిక్ష పడుతున్నది అతను చేసిన నేరం వలన. ఆలస్యం జరగటం వలన ఆ నేరంలో మార్పేమీ కలుగదు కదా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more