బొగ్గు కుంభకోణంలో విచారణ సాగించిన సుప్రీం కోర్టు సిబిఐ నివేదిక పట్ల అసంతృప్తిని ప్రకటించింది. ప్రభుత్వానికి ఇచ్చిన వివరణ కోర్టుకి ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. ముందుగానే ప్రభుత్వానికి నివేదికలోని వివరాలను తెలియజేయటంతో సిబిఐ దర్యాప్తు బలహీనమైపోయిందని, సిబి వైఖరిని తప్పుపట్టింది. దానితో పాటు సుప్రీం కోర్టు రాజకీయ వత్తిడిలో పనిచేస్తున్న సిబిఐ పట్ల అసహనాన్ని ప్రకటిస్తూ, దర్యాప్తు సంస్థ చేస్తున్న దర్యాప్తులలో రాజకీయ జోక్యం తగదని, సిబిఐ కి అందులోంచి విముక్తి కలిగించే ప్రయత్నాలు చేస్తామని ప్రకటిస్తూ, సిబిఐ స్వయం ప్రతిపత్తితో పనిచెయ్యటం చాలా అవసరమని, అందుకు ప్రయత్నాలు జరగాలని అభిప్రాయపడింది.
సిబిఐ మీద ఈ అభియోగం ఎప్పటి నుంచో వస్తోంది కానీ వాటికి ఎప్పుడూ నిరూపణలు లేకపోయాయి. దానితో ఒట్టి అభియోగాలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ మధ్య కాలంలో బొగ్గు కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్న సిబిఐ నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించటానికి ముందుగానే కేంద్ర న్యాయశాఖా మంత్రి దాన్ని పరిశీలించి అందులో మార్పులను సూచించిన విషయం వెలుగులోకి రావటంతో ఇన్నాళ్ళూ అనుకుంటున్నదంతా నిజమేనా, సిబిఐ ప్రభుత్వం చేతిలో ఝళిపించే కొరడా అయిందా, ప్రభుత్వం ప్రతిపక్షాలను కానీ మిత్ర పాలను కానీ లేదా తన పార్టీలోని అసమ్మతి వర్గాలను కానీ భయపెట్టటానికి, ఉస్కో అని వారిమీదకు ఉసిగొలపటానికి ఉపయోగపడుతోందా అన్నది ఒకింత మనసుని కల్లోలపెట్టే అంశమైంది.
కొద్దికాలం క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ములాయమ్ సింగ్ యాదవ్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ధృవీకరించారు. యుపిఏ ప్రభుత్వం తన మీద వత్తిడి తెచ్చిందని, తన మీద సిబిఐ ని ఉసిగొలిపిందని ఆయన బహిరంగ సభలో ఆరోపించారు.
రెండు సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైయస్ జగన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వుండటం మీద, సిబిఐ కేసులు పడితే తెలిసొస్తుంది అని వ్యాఖ్యానించటం జరిగింది. అంటే సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్నది జగమెరిగిన సత్యమైపోయింది. ఔను అది అలాగే జరుగుతుంది అని సమ్మతించే స్థితికి కూడా వచ్చేస్తున్నారు. అలాంటి సందర్భంలో సుప్రీం కోర్టు దీన్ని గంభీరమైన సమస్యగా తీసుకుని, దర్యాప్తు సంస్థను రాజకీయ కోరలనుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని ప్రకటించటంతో, ప్రజాస్వామ్యం ఇంకా కొంతకాలం బతికుంటుందనే ఆశ చిగురిస్తోంది.
విచారణను మే 8 కి వాయిదా వేస్తూ, ఏ నియమ నిబంధనలననుసరించి నివేదికను ముందుగానే వెల్లడి చేసారో తెలియజేయాలని సిబిఐ డెరెక్టర్ ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు మే 6 కల్లా ప్రభుత్వానికి తెలియజేసిన నివేదికలోని వివరాల మీద పూర్తి వివరణను ఇవ్వమని కోరింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more