ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలలో పెద్ద పెద్ద మార్పులే వస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీలకు బాగానే గాలం వేసి లాగుతున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి తెలంగాణ విషయంలో గడువు విధించిన విషయం తెలిసిందే. ఈనెల 30 లోపు తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పాలని లేకుండా పార్టీని వీడటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు తెరాస అధినేత కేసీఆర్ ని రహస్యంగా తన ఫాం హౌజ్ లో కలిశారు. ఏఐసీసీ సీనియర్ నాయకుడు కేకే ఆధ్వర్యంలో ఎంపీలు మందా జగన్నాథం, రాజయ్య, వివేక్ లు కేసీఆర్ ని కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాల పై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు హరీష్ రావు, కె.తారకరామారావులు కూడా పాల్గొన్నారు. దీంతో వారు టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయినట్లే.
మనకందిన సమాచారం ప్రకారం కేసీఆర్ ఎంపీలతో.... కాంగ్రెస్ లో కొనసాగుతూ.. ఇంకా తెలంగాణ ఇస్తుందని వేచి చూడటం కరెక్టు కాదని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చే అవకాశాలు లేనే లేవు కనుక వెంటనే టీఆర్ఎస్లోకి వస్తే అయిపోతుందని, అందుకే వారు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్లో వారి చేరిక జూన్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తోంది. వారికి పార్టీ తరఫున కేటాయించే నియోజకవర్గాలూ ఖరారైనట్లు సమాచారం. వివేక్ (పెద్దపల్లి), మందా జగన్నాథం (నాగర్ కర్నూలు)లకు సిటింగ్ ఎంపీ స్థానాలు ఇవ్వటానికి కేసీఆర్ సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. వరంగల్ సిటింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు మాత్రం మానకొండూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తానని కేసీఆర్ చెప్పిడంతో దానికి రాజయ్య కూడా సమ్మతం తెలిపారని అంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి వీరు గుడ్ బై చెప్పి కారు ఎక్కబోతున్నారని అంటున్నారు. మరి ఈ ఫాంహౌజ్ జంప్ జిలానీలు టీఆర్ఎస్ లో ఎంతకాలం కొనసాగుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more