ఇటీవల హలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలీ కేన్సర్ ను జయించిందని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడది నిజం కాదని చెబుతున్నారు. ఏంజెలినీ జోలీకి కేన్సర్ రాలేదట. కేవలం డబ్బుల కోసం కేన్సర్ కుంభకోణం జరిగినట్లు సమాచారం. మహిళలు కేన్సర్‌ను నిరోధించేందుకు ఉద్దేశింపబడిన జన్యువుల పరీక్షలోనూ ఓ కార్పోరేట్ కంపెనీ తన గుత్తాధిపత్యానికి తెరలేపింది.
దీనికి పెద్దన్న తన వంతు సహాయం చేశాడు. వెరసి మహిళల ఆర్ధిక స్ధితితో, సామాజిక హోదాతో సంబంధం లేకుండా జన్యు పరీక్షల పేరుతో వారి నుంచి డబ్బులు గుంజే నీచ ప్రయత్నానికి ఒడిగట్టింది. ఈ ప్రయత్నానికి హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలీ ప్రచారం తోడైంది. హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలి స్తనవిఛ్చేదనం చేయించుకుందన్న వార్త బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ అందాల భామ తన స్తనవిఛ్చేదన విషయాన్ని ఎంతో ధైర్యంగాచెప్పిందని మీడియాలో బాగా ప్రచారం జరిగింది. వారసత్వంగా వచ్చే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే ఈ జన్యు పరీక్షలకు జోలీ ప్రకటనతో విశేషమైన ప్రాచుర్యం వచ్చింది.
అయితే ఇందులో కొత్త వింత విషయం ఏంటంటే, జోలికి కేన్సర్ ఇంకా రాలేదు. పరీక్షలు చేయించుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు 85 శాతం ఉన్నాయని మాత్రమే తేలింది. తన తల్లి కేన్సర్‌తోనే చనిపోయిందని, అందువల్ల వారసత్వంగా జీన్స్ ద్వారా తనకు కూడా కేన్సర్ వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకున్నానని ఏంజెలినా చెప్పింది. అయితే ఎవరికైనా కేన్సర్ లక్షణాలు కనపడిన అనంతరమే పరీక్షలు చేయించుకుంటారు. కేన్సర్ ఉందని నిర్థారణ ఐతే అప్పుడు చికిత్స చేయించుకుంటారు. కానీ ఏంజెలినా జోలి కేసు విచిత్రమైనది. కేన్సర్ రాకముందే,వచ్చే అవకాశాలున్నాయని తను చేయించుకున్న పరీక్షలో నిర్థారణ కావడంతో వెంటనే ఆపరేషన్ చేయించుకుంది.
మహిళలందరూ ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ముందుగానే జన్యు పరీక్షలు చేయించుకోవాలని జోలి గొప్ప సలహా ఇచ్చింది. కేన్సర్‌కు చికిత్స చేయించుకుని ధైర్యంగా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఏంజెలినా సూచన వెనుక దాగివున్న కార్పోరేట్ కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. స్తనాలలో, అండాశయంలో జనించే కేన్సర్ కారక కణాలను అణచివేసే సామర్థ్యం బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 అనే జన్యువులకు ఉంటుంది. ఈ జన్యువులే గనుక లోపభూయిష్టమైనవైతే స్తనాలకు, అండాశయానికి కేన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. మామూలుగా అలాంటి జన్యు పరీక్ష అవసరం ఉండదు. ఒక కటుంబంలో రెండు తరాలు స్తన్య, అండాశయ కేన్సర్‌కు గురయిన చరిత్ర కలిగి ఉంటే అలాంటి జన్యు పరీక్షలకు వైద్యులు సూచిస్తారు.
జన్యు అనుక్రమం పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తగ్గుముఖం పడితే ఈ రెండు జన్యువుల పరీక్ష ధర ఈ మధ్య కాలంలో మూడు వేల డాలర్ల నుంచి నాలుగు వేల డాలర్లకు పెరిగింది. అంటే మన రూపాయాల్లో లక్షన్నరపైనే. అమెరికాలో ఈ పరీక్షలు మరే ఇతర కంపెనీ చేయటానికి వీలులేదు. తక్కువ ఖర్చుతో ఇంతకంటే బాగా ఈ పరీక్షలను చేయవచ్చు. అమెరికాలో మాత్రం ఇందుకు అనుమతి లేదు.
ఎందుకంటే మనిషి శరీరంలోని భాగాలైన బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 అనే జన్యువుల పేటెంట్ హక్కును అమెరికన్ కార్పొరేట్ కంపెనీ మైరియాడ్ జెనెటిక్స్ పొందింది. బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 జన్యువులు ప్రజలందరిలో ఉన్నప్పటికీ వాటిపై హక్కును అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీసు మైరియాడ్ జనటిక్స్ కంపెనీకి మాత్రమే ధారాదత్తం చేసింది. మామూలుగా మనిషిలో ఉండే 23,000 జన్యువుల అనుక్రమాన్ని కేవలం ఒక వెయ్యి డాలర్ల ఖర్చుతోనే తెలుసుకోవచ్చు. మైరియాడ్ జనెటిక్స్ కంపెనీ కేవలం రెండు రకాల జన్యు పరీక్షలకే మూడు వేల డాలర్లు గుంజుతుంది.ఎక్కువ సంఖ్యలో మహిళలు కేన్సర్‌ను నిరోధించేందుకు ఉద్దేశింపబడిన ఈ రెండు జన్యువుల పరీక్షలతో ఆ కంపెనీకి వేల కోట్ల లాభాలే వస్తాయి. ఇదే ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కోణం.
ఏంజెలినాకు స్తన కేన్సర్ చికిత్స, దానిపై ఆమె స్పందన, మహిళలకు ఆమె సలహాల నేపథ్యంలో అమెరికన్ కార్పొరేట్ కంపెనీ మైరియాడ్ జనెటిక్స్ షేర్ విలువ మార్కెట్ లో ఒక్కసారిగా నాలుగు శాతం పెరిగింది. దీంతో ఏంజెలినా ప్రకటన వెనుక మైరియాడ్ జనటిక్స్ అనే అమెరికన్ కార్పొరేట్ కంపెనీ ఉందనేది స్పష్టమవుతోంది. మరోవైపు బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 జన్యువుల లోపభూయిష్టతను కనుగొనే పద్ధతికి మైరియా జనెటిక్స్ పేటెంట్ పొందలేదు. దానికి బదులుగా మన దేహంలో ఉండే బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 జన్యువుల పునర్ ఉత్పత్తిని పేటెంట్గా పొందింది.
అంటే కేన్సర్ లక్షణాలు కనిపిస్తే వాటిని పునరుత్పత్తి చేయడానికి కేవలం ఈ కార్పొరేట్ కంపెనీకి మాత్రమే హక్కు ఉంటుంది. ప్రపంచంలో మరే కంపెనీకీ ఆ హక్కు ఉండదు. అంటే జన్యు పునరుత్పత్తిపై ఈ కంపెనీకి గుత్తాధిపత్యం ఉంటుంది. దాంతో స్తన కేన్సర్ భారిన పడిన రోగులకు చికిత్స పెనుభారమవుతుంది. అంటే బ్రస్ట్ కేన్సర్ వచ్చిన రోగుల ప్రాణాల కన్నా ఈ అమెరికన్ కార్పొరేట్ కంపెనీకి లాభాలే మిన్న. అందుకే ఏంజెలినా మహిళలకు సూచన చేసింది. పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ఆమె ప్రకటన వెనుక ఇదే వ్యూహం ఉందన్నది ఇప్పుడు స్పష్టమవుతోందని వైద్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more