ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైలులో పెట్టారని ఆయన సతీమణి భారతి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. జగన్ కు ఖచ్చితంగా బెయిలు వస్తుంది. సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుంది. కుట్ర పూరితంగా చేసి ఎంతకాలం జగన్ ను బయటకు రాకుండా ఆపలేదు” అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.
జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారం ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో జగన్ సతీమణి భారతి కూడా పాల్గొన్నారు. విలువలు లేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు తెలుసు. వైఎస్ మరణించిన తరువాత మా కుటుంబాన్ని ఎన్నో బాధలు పెట్టారు. మా ఇబ్బందులను చూసి కొందరు ఆనందపడుతున్నారని విజయమ్మ అన్నారు. ప్రజల పక్షాన పోరాడే వారు ఉండకూడదనే జగన్ ను జైలుకు పంపారని, దేవుడు ఉన్నాడని, తప్పక న్యాయం జరుగుతుందని జగన్ సతీమణి భారతి అన్నారు.
ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అని, ఆమె అన్నారు, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖర రెడ్డి వల్లే మంత్రులయ్యారని చెప్పారు. వైఎస్ కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భారతి ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more