ప్రభుత విఫ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై ఉన్న ప్రేమను ఈ రోజు బయట పెట్టారు. జగ్గారెడ్డి మొదట టీఆర్ఎస్ పార్టీ లో ఉన్న విషయం తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. అయితే అప్పటి నుండి జగ్గారెడ్డి, కేసిఆర్ల మద్య పచ్చగడ్డి వేస్తే .. భగ్గుమంటుంది. కేసిఆర్ పై తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు జగ్గారెడ్డి. అయితే నగరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిరంగ సభ చూసిన జగ్గారెడ్డికి కేసిఆర్ ప్రేమ కలిగింది. తెలంగాణ కోసం కేసిఆర్ ఒక్కొ మొట్టు తో విజయం సాధిస్తున్నారు. అందుకే కేసిఆర్ జగ్గారెడ్డి సన్మానం చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు మాయమాటలు, దొంగ మాటలు చెప్పి వారిని తప్పుదోవ పట్టించడంలో కెసిఆర్ విజయవంతమవుతున్నారని, అందుకు ఆయనకు సన్మానం చేయాలని జగ్గారెడ్డి అంటున్నారు.
గత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, ప్రస్తుత సిఎం ముఖ్యమంత్రి వద్ద హరీష్ రావు నిధులు తీసుకువెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసుకోలేదా అని ప్రస్నించారు. అలాంటప్పుడు కిరణ్ నిధులు ఇవ్వనన్నారని ఎలా అంటారన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం వేరన్నారు. కెసిఆర్ సంవత్సరంపాటు కేంద్రంలో మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. దొంగమాటలతో ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. కిరణ్ తెలంగాణ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. అయితే కేసిఆర్ కు సన్నామన సభ త్వరలో ఉంటుందని ఆయన జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ కోసం కేసిఆర్ కుటుంబం మొత్తం త్యాగం చేస్తుందని జగ్గారెడ్డి అన్నారు. అందుకే ముందుగా కేసిఆర్ కు నిజాం కాలేజీ గ్రాండ్ లో సన్మాన సభ భారీ ఎత్తున్న ఏర్పాటు చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more