భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. భారతదేశ రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్న అద్వానికి అదృష్టం ఎప్పుడూ కలిసిరాలేదు. ఆర్‌ఎస్‌ఎస్ భావాలు నరనరాన జీర్ణించుకున్న అద్వాని కరడు గట్టిన మతతత్వ రాజకీయాలతోనే బిజెపిని ముందుకు నడిపారు.
అప్పటివరకు పార్లమెంట్‌లో తక్కువ సీట్లతో విపక్షానికే పరిమితమైన పార్టీని తన రథయాత్ర ద్వారా అధికారంలోకి తెచ్చి ఘనత అద్వానీకే దక్కుతుంది. ఇంత చేసినా ప్రధాని పదవి మాత్రం ఆయనను వరించలేదు. ఆ పదవిని సీనియర్ నేత అటల్‌బిహారీ వాజ్‌పేయి తన్నుకుపోయారు. . కొద్ది రోజుల క్రితం పార్టీకి దశా..దిశా అన్ని తానే అయి నడిపించిన అద్వానీ.. ఇక బిజెపిలో ఒక సాధారణ కార్యకర్తగానే మిగిలిపోనున్నారా..? ప్రధాని పదవిపై అతను పెట్టుకున్న ఆశలు చివరకు అడియాశాగానే మిగిలిపోనున్నాయా..? ఇక ఆయన నాయకత్వం క్రమక్రమంగా తెరమరుగయ్యే పరిస్థితి ఉందని గోవాలో జరిగిన సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి.
ఒకప్పుడు రథయాత్ర ద్వారా బిజెపికి అధికారాన్ని కట్టబెట్టి కింగ్‌మేకర్ అయిన అద్వాని-ఇపుడు అదే పార్టీలో ఎవరిని శాసించలేని జీరో అయ్యే పరిస్థితి నెలకొంది. ఎప్పటికైనా భారతదేశ ప్రధాని కావాలనుకున్న అద్వాని కలలు ఇప్పుడు మోడి రూపంలో ఆవిరైపోయాయి. గోవాలో జరుగుతున్న బిజెపి జాతీయ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అతని అనుకూల వర్గం ఏకమై ఎన్నికల ప్రచార కమిటి సారథిగా మోడికే పట్టం కట్టింది. ఈ విషయంలో తన మాట నెగ్గదని తెలుసుకున్న అద్వాని- అనారోగ్యం కారణం చూపి సమావేశాలకు డుమ్మా కొట్టారు. మరోవైపు అద్వాని అనుకూల వర్గంగా భావించే అరుణ్‌జైట్లి, సుష్మాస్వరాజ్ వంటి నేతలు తమ అవకాశవాదాన్ని ప్రదర్శించారు. ఒకనాడు ప్రధాని పదవికి మతతత్వ ముద్ర అడ్డు వచ్చింది.
రథయాత్ర బిజెపికి వరమైతే వ్యక్తిగతంగా అద్వాని కరడుగట్టిన హిందుత్వ వాదిగా మార్చింది. ఈ కారణంగానే ఆయన అత్యున్నత పదవికి దూరం అయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హిందుత్వ ముద్ర చెరిపేసుకోవడానికి అద్వాని ఎన్నోతంటాలు పడ్డాడు. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే ఎసరు పెట్టింది. ఇప్పుడు అదే శాపంగా మారింది.. అదే మతతత్వం నరేంద్ర మోడికి పగ్గాలు అప్పగించేందుకు కారణమైంది. గుజరాత్‌లో తానేదో అద్భుతం చేసినట్లుగా స్వంత డబ్బా కొట్టుకుంటూ ఇటీవల ప్రచారం చేసుకోవటం.. మీడియాలో అతడిని అతిగా చూపించడం లాంటి వాటితో బిజెపికి మోడి అవసరం ఉందని కమలనాధులు భావించారు.
ఫలితం అద్వాని ఏ ఎజెండా లేక జీరో అయిపోయారు. 2009 ఎన్నికల సమయంలోనే ప్రధాని అభ్యర్థిగా అద్వాని వయసుపై పార్టీలో అభ్యంతరాలొచ్చాయి. 65 ఏళ్ల వయసు దాటిన నేతలు సన్యాసం పుచ్చుకోవాలో వద్దో తమని తాము ఆత్మవిమర్శ చేసుకోవాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత గా కూడా ఆయన ఎంపిక కాలేదు. దీంతో అద్వానిని సమర్థించేవారు లేక ఆయన ఒంటరైపోతున్నారు. ఇక బిజెపిలో అద్వాని రాజకీయ శకం ముగిసినట్లేనని రాజకీయనేతలు విశ్లేషిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more