టాలీవుడ్ లో బొగ్గు మంటలు చేలరేగాయి. ఈ బొగ్గు మంటలు నవీన్ జిందాల్ , దాసరి వలనే టాలీవుడ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పద్మశ్రీ దాసరి నారాయారణ రావు ఇంట్లో సీబీఐ సోదాలు జరుగున్నాయి. ఒకేసారి సిబిఐ అధికారులు 19 చోట్ల దాడులు చేస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో దాసరి పేరు రావటంతో.. సీబీఐ అధికారులు దాసరిని ప్రశ్నించారు. దాసరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. దాసరి నారాయణ రావు పాటు రెండు కంపెనీల పై కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో దాసరి నారాయణరావు పాత్రపై మొదటి నుంచి వస్తున్న అనుమానాలు సీబీఐ ఎఫ్ఐఆర్ తో నిజమయ్యాయి. పారిశ్రామిక దిగ్గజం నవీన్ జిందాల్‌తో ఉన్న బంధంతో ఈ వ్యవహారంలో దాసరి పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. బొగ్గుశాఖ సహాయ మంత్రిగా దాసరి నారాయణరావు ఉన్న సమయంలో నవీన్ జిందాల్ గ్రూపునకు భారీగా కోల్ బ్లాక్‌ల కేటాయింపులు జరిగాయి.
ఇందుకు ప్రతిఫలంగా దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి జిందాల్ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసింది. కాస్త లోతుగా వెళ్తే సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా ఎంటర్టైన్మెంట్ కంపెనీ మన రాష్ట్రానికి చెందినదే. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన దీంట్లో సిరి మీడియా అనే కంపెనీ 59.6 శాతం వాటా కలిగి ఉంది. ఈ సిరి మీడియా కంపెనీ తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు చెందింది. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరుకు 112 రూపాయల 50 పైసలు వెచ్చించి మరీ న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. దాసరి పేరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు. మేస్ర్త్రీకి మసి అంటుకోవటం పై ఫిలింనగర్లో కొత్త పుకార్లు ఉపందుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more