ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్రీగా పబ్లిసిటీ పొందేందుకు దర్శక నిర్మాతలు మంచి ప్లాన్లే వేస్తున్నారు. పెద్ద హీరో సినిమా పై జనాల్లో ఆసక్తిని పెంచేందుకు ఇలా చేస్తున్నారో, లేక ఎవరైనా అపరిచితులు చేస్తున్నారో గానీ, ఆయా సినిమాలకు సంబంధించిన డైలాగులు లీక్ చేసి హల్ చల్ చేస్తున్నారు. దీంతో జనాల్లో ఆ సినిమా పై క్రేజ్ ఏర్పుడుతుంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న ‘‘1’’ సినిమాలోని కొన్ని డైలాగులు కొన్ని లీక్ అయ్యాయి(చేశారు). ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగులు అభిమానులను పలకరిస్తున్నాయి.
1. నా వాయిస్ లో ఫ్రీక్వెన్సీ ని బట్టి నా వైయిలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో డిసైడ్ చేసుకో...
2. నా స్పీడ్ కి కామా పెట్టాలనుకోకు నీ లైఫ్ కి ఫుల్ స్టాఫ్ పడుద్ది...
3. మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో....చరిత్ర చూడని నెపోలియన్ ని....ప్రపంచం చూడని హిట్లర్ ని నీకు ఎక్లక్లూజివ్ గా నేను చూపిస్తా...
4. నేను ఫామ్ లోకి వచ్చాక ఫిక్స్ అవుతా.......ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవడైనా సరే ఫిదా అయిపోవాల్సిందే...
క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో మహేస్ సిక్స్ ప్యాక్ బాడీలో తొలిసారిగా కనిపించబోతున్నాడు. 14 రీల్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ షెడ్యూలు ఈ నెల 18 నుంచి లండన్ లో ప్లాన్ చేశారు. దీని పై నిర్మాతలు మాట్లాడుతూ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more