మనుషులు అందులో కూర్చుని నడపాల్సిన అవసరం లేకుండానే ఆకాశగమనం చేసే విమానాలను (drone) లను ఎక్కువగా అమెరికా మిలిటరీ వాడుతోంది. ఇవి, ప్రపంచంలో ఎక్కడైనా వేలాది కిలోమీటర్ల దూరంలో కోరుకున్న చోటుకెళ్ళి బాంబులు వేసి రావటానికీ ఉపయోగపడతాయి, ఉపయోగించేవారి తరఫునుంచి సాంకేతిక నిపుణుల ప్రాణ నష్టాన్ని కూడా అరికడతాయి. ఒక్క యుద్దం కోసమే కాకుండా డ్రోన్ లను నిఘా కోసం కూడా ఉపయోగిస్తారు.
డ్రోన్ వాడకాలు చాలా విమర్శలకు గురవుతున్నాయి. అయినా అవి ఇంకా రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూనేవున్నాయి కాని తగ్గటం లేదు.
పై ఫొటోలోని నార్త్రాప్ గ్రుమ్మన్ X-47B. ఇది మొదట తయారైన డ్రోన్. దీన్ని ఒక విమానం నుంచి నియంత్రించవలసి వచ్చేది. దీన్ని ప్రపంచంలో ఎక్కడికైనా ఏ ప్రాంతపు విమాన కేంద్రాలనుంచి ఎవరి అనుమతులూ తీసుకోకుండానే నడిపించవచ్చు.
ఈక్రింది బోయింగ్ ఫాంటమ్ రే డ్రోన్ చూడటానికి మామూలు జెట్ విమానంలాగానే ఉంటుంది. ఇది మొదటిసారి 2011 లో వాడుకలోకి వచ్చింది.
ఈ క్రింది ఫోటోలో ఉన్న నాలుగు రెక్కల నార్త్రాప్ గ్రుమ్మన్ 8C ఫైర్ X ఒక్క ఇంజన్ తో కూడిన డ్రోన్ హెలికాప్టర్. ఇది 29 మైళ్ళ వేగంలో వీచే గాలిలో ఓడ మీద ల్యాండ్ అవగలదు.
బోయింగ్ ఇన్సిటు RQ-21 న్యమాటిక్ లాంచర్ తో లాంచ్ చెయ్యవలసిన కాటాపుల్ట్ ని పోలిన డ్రోన్. ఫిబ్రవరి 2013 లో దీని పరీక్షణ పూర్తయింది.
ఈ క్రిందివి భవిష్యత్తులో రాబోతున్న డ్రోన్ లు.
ఈ క్రింది ఫొటోలోది MQ-4C. దీన్ని భూమి మీద నలుగురు నిపుణులు కలిసి నియంత్రిస్తారు. ఇది ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇది గంటకి 357 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇది 2015 వరకు వాడకంలోకి రావచ్చని అంచనా.
ఈ క్రింద కనిపించేది సీ ఘోస్ట్. ఇంకా సాంకేతికంగా సంపూర్ణరూపం దాల్చని ఈ డ్రోన్ 2018 కల్లా వాడకంలోకి వస్తుందని అంచనా. మొట్టమొదటి డ్రోన్ ని నలుగురు మనుషులు నియంత్రించే విధంగా తయారు చేస్తే, ఇలాంటి ఎన్నో డ్రోన్ లను ఒకే వ్యక్తి భూమి మీద ఉండే నియంత్రించగలుగుతాడు.
బోయింగ్ ఫాంటమ్ ఐ చాలా పనిచేసే సామర్థ్యంగల డ్రోన్. ఇది నిరంతరాయంగా నాలుగు రోజులు పనిచేస్తుంది. ఈ క్రింది అల్ట్రా సీక్రెట్ బోయింగ్ లాంగ్ రేంజ్ స్ట్రైక్ B హెవీ బాంబర్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న రహస్య బాంబర్ల స్థానంలోకి వస్తాయి. 2020 వరకు పూర్తవుతాయని అంచనా వేస్తున్న ఈ డ్రోన్ ల ఖరీదు $550 మిలియన్లు.
మొత్తానికి, ఎంత ఖర్చైనా సరే వెనక్కి తగ్గేది లేదంటోంది అమెరికా ప్రభుత్వం, రక్షణ శాఖ! ఎందుకంటే, ప్రపంచంలో ఏ మూలనుంచీ అమెరికాకు ఎటువంటి ఆపదా రాకుండా, ఏ మూల దాగున్నా శత్రువు ఆచూకీ తీయటానికి, ముందుకు రాకుండానే తమ సైన్యానికి రక్తపాతం లేకుండానే శత్రు దేశాన్ని మట్టు పెట్టటానికి ఈ డ్రోన్ లు బాగా ఉపయోగపడతాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more