జూన్ 30న తెలంగాణ సాధన సభ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రి జానరెడ్డి, ఉప ముఖ్య మంత్రి దామోదార రాజ నర్సింహ ఆద్వర్యంలో నిజాం కాలేజీలో గ్రౌండ్ లో జరిగిన సభను విజయవంతం చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ కోరే నాయకులే ఈ సభకు హాజరుకాకపోవటం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చగా మారింది. హైదరాబాద్ నుండి మంత్రి దానం సభకు ఎందుకు రాలేదు అంటే.? నన్ను ఎవరు పిలవలేదు, నాకు ఆహ్వానం అందలేదని మీడియా ముందు చెప్పిన దానం , ఇప్పుడు మాటమార్చిన, అసలు దాగి ఉన్న నగ్న సత్యాన్ని బయటపెట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులను భారీగా ఈ సభకు తరలించారు. రాష్ట్ర రాజధానిలో సభ నిర్వహించినప్పటికీ హైదరాబాద్ కాంగ్రెస్ లో పెద్దగా సందడి కనబడలేదు. రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తమకు ఏమీ పట్టనట్టు మిన్నకుండి పోయారు. ముఖేష్ గౌడ్ నగరంలోనే ఉన్నప్పటికీ సభకు హాజరుకాలేదు. తెలంగాణ సాధన సభకు డుమ్మ కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
విష్ణువర్థన్ రెడ్డి (జూబ్లీహిల్స్)
మర్రి శశిధర్ రెడ్డి (సనత్ నగర్)
మణెమ్మ (ముషీరాబాద్)
డాక్టర్ శంకర్రావు (కంటోన్మెంట్)
జయసుధ (సికింద్రాబాద్)
ఆకుల రాజేందర్ (మల్కాజిగిరి),
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్)
కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్)
వీరు తెలంగాణ సాధన సభకు దూరంగా ఉన్నారు. వీరంతా తమ నియోజక వర్గాల్లోనే గడిపారే తప్ప సభవైపు కన్నెత్తి చూడలేదు. మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సభకు హాజరయి ప్రసంగించగా.. ఉప్పల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, భిక్షపతి యాదవ్ లు ప్రసంగించేందుకు సైతం ఆసక్తి చూపించలేదు. తెలంగాణ సాధన సభలో నగరానికి చెందిన మెజారిటీ నేతలు పాల్గొనకపోవడం అధికార పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు సభలో పాల్గొనవద్దని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలివ్వడంతో వీరంతా వెనక్కు తగ్గారని దానం నాగేందర్ వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన నేతలు తెలంగాణకు సంబంధించిన ఎటువంటి సభకు వెళ్లవద్దని అధినేత్రి అల్టిమేటం జారీచేశారని చెప్పారు. మేడం ఆదేశాలను శిరసావహించి తాను తెలంగాణ సాధన సభకు దూరంగా ఉన్నానని నగ్న సత్యాన్ని బయటపెట్టారు. సభలో సోనియా జపం చేసిన తెలంగాణ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more