కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ద్రుష్టి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకోవటమే. అందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ ‘కాంగ్రెస్ డిఎన్ఏ ’ అంటూ చేసిన విమర్శలు వైసీపీ నాయుకుల్లో కొంత అలజడి రేపింది. కాంగ్రెస్ డీఎన్ ఏ పై పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల కౌంటర్ ఇవ్వటంతో వైసీపీ నాయకుల్లో అలజడి తగ్గినట్లు సమాచారం.
కాంగ్రెస్ ఢీఎన్ఏ మా పార్టీలో లేదని, దిగ్వీజయ్ సింగ్ తెలుసుకోవాలని షర్మిలా సూచించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో హై టెన్షన్ పెరిగిపోతున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. తెలంగాణ విభజన పేరుతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ లైన్ క్లియర్ చేసుకునే పనిలో పడగా, సీమాంద్రాలో మాత్రం అది పెద్ద సమస్యగా మారిన జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి . ఇప్పటికే రాహుల్ గాంధీ దూతలు వైఎస్ జగన్ తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. జగన్ మర్యాదగా వస్తే .. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి పదవి, మంచి సౌకర్యాలు ఉంటాయాని, ఇప్పట వరకు ఉన్న కేసులను తొలగించే అవకాశం కూడా ఉందని, రాహుల్ గాంధీ దూతలు వైఎస్ జగన్ కు చెప్పినట్లు సమాచారం.
ఒకవేళ పార్టీలోకి రాకపోతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాతమ్ చేస్తామని రాహుల్ గాంధీ దూతలు వైఎస్ జగన్ ను హెచ్చరించినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే అందరికి మంచి జరుగుతుంది, కానీ ఒకవేళ జగన్ మొండిగా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఢిల్లీ నాయకులు జగన్ కు సూచించినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిస్తేనే మంచి జరుగుతుందని, లేకపోతే కష్టాలు ఎదరవుతాయాని జగన్ కు చెప్పినట్లు సమాచారం. ఒక వేళ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏమిటి? జగన్ శ్వాశతంగా జైల్లోనే ఉండిపోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా జగన్ కు రాహుల్ గాంధీ దూతలు సీఎం పదవి ని కూడా ఎరగా వేసినట్లు సమాచారం. 2014 లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలో వస్తే మాత్రం .. జగన్ కు సీఎం పదవి ఇవ్వటానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ప్రజలకు సేవా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే .. కాంగ్రెస్ పార్టీ నుండే చెయ్యవలిసిందిగా రాహుల్ గాంధీ దూతలు జగన్ కు సూచించారు.
ఈ విషయంపై జగన్ పార్టీలోను, జగన్ కుటుంబ సభ్యుల మద్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటన చేస్తారని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎదురించి సాధించే కన్న.. సానుకూలంగా సాధిస్తే .. ఫలితం ఎక్కువుగా ఉంటుందని జగన్ కు పార్టీలోని సీనియర్ నాయకులు చెప్పినట్లు సమాచారం. ఇంక పూర్తిగా క్లారిటీ రావాలంటే.. కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు పంచాయితీ ఎన్నికల సంగతి చూద్దాం..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more