ఈ రోజు గురపౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో వేడుకలు జరుగుతున్నాయి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆధ్యాత్మిక రంగంలో అభ్యాసకులు ఈ రోజు వ్యాస మహర్షిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుని భౌతిక శరీరాలతో ఉన్న వారి వారి గురువుల ఆశీర్వాదాన్ని పొందటానికి ఆశ్రమాలకు వెళ్తారు. ఈ రోజు వ్యాసునిగా ప్రఖ్యాతికెక్కిన కృష్ణ ద్వైపాయనుడు జన్మించిన రోజు. అంతేకాదు ఈ రోజు పూర్తైన వెంటనే అంటే ఆషాడ శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మ సూత్రాల రచనను ప్రారంభించారు వ్యాస మహర్షి.
వేదాలను సమీకరించి, వాటిని క్రమపద్దతిలో కూర్చి, నాలుగు వేదాలుగా విభజించిన వ్యాస మహర్షి మరెన్నో రచనలను చేసారు. అందులో భారతం, అందులోని అంతర్భాగమైనా విడిగా ప్రత్యేకతను సంతరించుకున్న భగవద్గీత లను ప్రపంచానికి అందించిన ప్రథమ గురువుగా వ్యాసుని కీర్తిస్తూ గౌరవ భావాన్ని ప్రకటించుకుంటారు. గురువంటే అంధకారాన్ని పోగొట్టేవాడు- అంటే, మనుషులలోని జ్ఞానాంధకారాన్ని పొగొట్టేవాడని అర్థం. గురు శిష్య సంబంధం అత్యంత మహత్వనీయమైనది. దీనికి హిందువులు, బౌద్ధులు, జైనులు, కూడా ఎంతో విలువనిచ్చారు. బౌద్ధుల నమ్మకం ప్రకారం ఈ రోజు భగవాన్ బుద్ధుడు ఉత్తర ప్రదేశ్ లోని సారనాధ్ లో తన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చేసారు. జైనులలో 24 వ తీర్థంకరుడైన చౌమాసాస్ (చాతుర్మాస) దీక్షను ప్రారంభించిన రోజు.
దైవ మార్గాన్ని సూచించేవాడు గురువే కాబట్టి ఆ దైవంతో సమానంగా గురువుకి గౌరవమిస్తారు. షిర్డీ సాయిబాబాకి గురుపౌర్ణమి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ రోజు సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. రాష్ట్రమంతా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాత కాలం నుంచే భక్తులు సాయిబాబా ఆలయాల్లో బాబా దర్శనం చేసుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్త జన సందోహంతో షిర్డీలో సాయిబాబా ఆలయం కిటకిటలాడుతోంది.
ఈ రోజు గురువులు శిష్యుల హృదయాన్ని తాకి వారిలోని చైతన్యాన్ని మేలుకొలుపుతారని హిందువుల నమ్మకం. ఆధ్యాత్మిక గురువులు ఈ రోజు చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. విశాఖపట్నం లోని శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి ఈరోజు చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. చాతుర్మాస దీక్షలో నాలుగు నెలల పాటు విడిగా నిష్టగా ఉంటూ తమ సాధనలో కొందరుంటే, కొందరు శిష్యులకు ఆధ్యాత్మిక ప్రవచనాలిస్తూ గడుపుతారు.
ఈ రోజు ముఖ్యంగా మననం చేసుకునే మంత్రబద్ధమైన గురుప్రశంస-
గురుబ్రహ్మ గురుర్ విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మై శ్రీ గురవే నమ:
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more