జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు చేస్తుందో ఎవరు చెప్పలేరు. శత్రువులను సైతం కౌగిలించుకోని.. పదవులు కట్టేబెట్టే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని అందరికి తెలుసు. అవినీతి కుంభకోణాలతో నిండా మునిగిపోయినప్పటికి అధికారం కోసం కొత్త కొత్త పావులు కదుపుతోంది. ఇప్పుడు రంగంలోకి ప్రియాంకగాంధీని దించటానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దమవుతుంది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీని దూరంగా పెడుతున్నారు. ప్రియాంక గాంధీ వైపు మొగ్గుచూపుతున్నారు. మోడీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రచార ఎత్తుగడలతో ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న మోడీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కసరత్తును మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ పోటీచేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అంతర్గత సర్వేలతో కంగుతిన్న కాంగ్రెస్ తెరమీదకు ప్రియాంక గాంధీని తీసుకువస్తోంది. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహ కర్తలు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకోవడంలో అత్యంత కీలకపాత్ర పోషించే ఉత్తర్ ప్రదేశ్ లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
అచ్చం నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకను రంగంలోకి దించితే సానుకూల ఫలితాలు సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటిదాకా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి కాంగ్రెస్ గట్టెక్కాంలంటే ప్రియాంకను పోటీలో దింపడం తప్ప వేరే గత్యంతరం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. యూపీలో ప్రతికూల వాతావరణం ఉన్నట్లు అంతర్గత సర్వేలు కూడా హెచ్చరించడంతో ప్రియాంక కూడా పోటీ చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గానికి ప్రియాంక ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టడంతో మునపటిలా ఉత్తర్ ప్రదేశ్ మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు రాహుల్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పెద్దగా ప్రయోజనం దక్కలేదు. దీంతో రాహుల్ జనాకర్షక శక్తిపై కాంగ్రెస్ వ్యూహకర్తలు డైలమాలో పడ్డారు. ప్రియాంకను కూడా తెరమీదకు తెచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న గడ్డుపరిస్థితుల్ని ప్రియాంక ఏవిధంగా గట్టేక్కిస్తోందో వేచిచూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more