సాయంతం నాలుగు గంటలకు యుపిఏ సమన్వయ కమిటీ, 5.30 కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటి మీటింగ్ లలో రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయం జరగబోతోంది.
రాష్ట్రాన్ని విభజించాలా లేక సమైక్యంగా ఉంచాలా అన్న చర్చల మీద కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ శరవేగంతో విభజన దిశగా అడుగులు వేస్తుండటంతో సీమాంధ్రనేతలకు విషయం మింగుడు పడటం లేదు. నేతలంతా కలిసి ఇచ్చిన నివేదికలు, వారి తరఫు వాదనలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మార్చలేకపోయాయి.
ఇంతకాలం తెలంగాణా కాంగ్రెస్ నాయకులు పడ్డ మనోవేదన ఇప్పుడు సీమాంధ్రనాయకుల వంతైంది. మా ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటుంటే మేము గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతోందని తెలంగాణా నాయకులు లోగడ చేసుకున్న వినతులను లెక్కచేయనట్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీమాంధ్ర నేతల మాటలను పట్టించుకోవటం లేదు.
అయితే ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే, ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తెలంగాణా నాయకులు అక్కడ ఇదమిద్ధంగా ఏమీ తేలకపోవటంతో తిరిగి వచ్చి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో అప్పుడుంటే, తెలంగాణా వచ్చేదేమీ కాదులే అని ధీమాగా ఉన్న సీమాంధ్రులకిప్పుడు జరుగుతున్న పరిణామాలు అశనిపాతంలా తగులుతున్నాయి. అధిష్టానానికి తలవొగ్గి నమ్రతగా నడుచుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా, ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. అయినా అందరి మాటలనూ విన్న కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో చకచకా పావులు కదుపుతోంది. అప్పుడు తెలంగాణా నాయకులు రాజీనామాస్త్రాలు సంధించటం చేస్తే ఇప్పుడు ఆంధ్రానాయకులు కూడా అవే ఉపయోగించారు. అప్పడు వాటిని పట్టించుకోనట్లే ఇప్పుడు వీటినీ పట్టించుకోవటం లేదు అధిష్టానం.
మొదటి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పుంజుకున్న రాజకీయ బలంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడీ విభజన మూలంగా పట్టు పోగొట్టుకుంటామేమోననే ఆదుర్దాను వెలిబుచ్చిన రాష్ట్ర నాయకుల మాటలకు కాంగ్రెస్ పార్టీ విలువనిచ్చినట్టుగా లేదు. సీమాంధ్ర నాయకులకు ఢిల్లీ విడిదిగా తయారైంది. ఎప్పడూ చెయ్యనన్ని చర్చలు, ఎప్పుడూ వెళ్ళనంత తరచుగా ఢిల్లీ పెద్దలను కలవటానికి వెళ్ళటం, అక్కడే తిష్ట వెయ్యటం చేస్తున్నారు.
మొత్తానికి తెలంగాణా కాంగ్రెస్ నాయకుల వేదన ప్రస్తుతం సీమాంధ్ర నాయకులను పట్టుకుంది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి స్వాంతన పలుకుతూ చేసిన పనేమిటంటే పారా మిలిటరీ అదనపు బలగాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో మోహరింపజేయటం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more