ఏన్నో ఏళ్ల పోరాటం, ఎందరో త్యాగాల అనంతరం భేటీల మీద భేటీలు, చర్చల మీద చర్చలు, కమిటీల మీద కమిటీలు వేసిన తరువాత చివరికి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. దీంతో తెలంగాణ వాదుల్లో సంతోషం, సీమాంధ్ర వాదుల్లో ఆగ్ర జ్వాలలు. ఆ విషయం ప్రక్కన పెడితే.... అతి త్వరలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు ప్రాంతాల్లో ముఖ్యమంత్రులను ఎవర్ని నియమిస్తే బాగుంటుందనే విషయం కూడా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటు ఇరు ప్రాంతాల్లో కూడా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు వస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం ఇరు ప్రాంతాలకు ఇప్పటికే సీఎంలను డిసైడ్ చేసిందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి బీసీ లేదా ఎస్సీ ముఖ్యమంత్రిని నియమించాలని తీర్మానించినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి ఘట్టంలో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్న రాజనరసింహాకు ఎస్సీ వర్గం నుండి, ఒకవేళ బీసీ వర్గం నుండి అయితే .శ్రీనివాస్, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యతో పాటు, నిజామాబాద్ ఎంపి మధుయాష్కీగౌడ్ వీరిలో ఒకర్ని నియమించేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రాంత సీఎంగా ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవిని నియమించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ మారుతున్న పరిణామాలను పరిశీలిస్తే బీసీలకు రాజకీయ వాతా వరణం అనుకూలంగా ఉంది. గతంలో బీసీకి చెందిన డి శ్రీనివాస్ రెండుసార్లు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షడిగా పని చేసినా ముఖ్యమంత్రి పదవి మాత్రం దక్కలేదు. అలాగే హ్యాట్రిక్ రాజ్యసభ సభ్యుడైన వి.హనుమంతరావు కూడా పిసిసి అధ్యక్షునిగా పనిచేసినా ఆయనకు కూడా అటు వంటి అవకాశం లభించ లేదు. జనాభాలో దాదాపు 65 శాతం దాకా ఉన్న బీసీలకు ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కేవలం పార్టీ పదవులకు మాత్రమే పరిమితం చేశారనే అసంతృప్తి బీసీల్లో వ్యక్త మవుతోంది. అయితే ప్రస్తుత రాష్ట్ర విభజనవల్ల బీసీల్లో సిఎం అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహారాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే బీసీలకే ఇవ్వాలని డిమాండ్ ఉన్నా, కాస్తంత అనుభవం ఉన్న నాయకుడికి ఇస్తే భాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం ని డిసైడ్ చేసి, రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రకటనే తరువాత అన్న విధంగా ఉన్న అధిష్టానం ఎవరి పేర్లు ప్రకటిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more