దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళకు కారకుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ భారత్ నేపాల్ సరిహద్దులో పట్టుబడటంతో 2006 నుంచి పట్టుకోవటానికి సర్వశక్తులూ వోడిన భద్రతా దళాలు విజయం సాధించాయి. ఉగ్రవాదమే ధ్యేయంగా స్థాపించి నడిపిస్తున్న భారత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ నడుం విరిగింది.
బీహార్ పోలీసులు, నిఘా సంస్థ కలిసి పన్నిన పథకంలో యాసిన్ భత్కల్ అతని అనుచరుడు అసదుల్లా అక్తర్ చిక్కారు. భత్కల్ బిహార్ పోలిసుల అదుపులో ఉన్నట్టుగా హోం మంత్రి సుశీల్ షిండే ప్రకటించారు.
కర్నాటకకు చెందిన భత్కల్ దేశంలో 40 బాంబు దాడులకు బాధ్యుడు. అందులో హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ తో పాటు అహ్మదాబాద్, సూరత్, వారణాసి, జైపూర్, బెంగళూరు, ముంబై, పుణే, ఢిల్లీలు ఉన్నాయి. బాంబు నిపుణుడు, ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా పట్టుబడ్డ తర్వాత సమాచారాన్ని బయటకు లాగిన నిఘా దళాలు మరో ఉగ్రవాద దాడికి భత్కల్ ద్వారా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుసుకుని ఆ ముఠాను ముట్టడించటం జరిగింది. అందులో భత్కల్ పోలీసులు చేతికి చిక్కాడు. తను ఇంజినీర్ నని కాసేపు యునాని డాక్టర్ నని కాసేపు బుకాయించాలని చూసినా పోలీసులు దగ్గర ఈ సారి అతని పాచిక పారకపోవటంతో చివరకు తను భత్కల్ నేనని ఒప్పుకున్నాడు.
కానీ అందరి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న భత్కల్ ముఖంలో కానీ మాటల్లో కానీ పశ్చాత్తాపం లేశమంతైనా లేదు. అంతా అల్లా చూసుకుంటాడు అని అనటంలో అతని మనసులో కరడుగట్టుకుపోయిన ఉగ్రవాదం ఎంత ఉందో అర్థమౌతోంది.
భత్కల్ అరెస్ట్ తో ఇండియన్ ముజాహిదీన్ కార్యక్రమాలు కుంటుపడతాయని చెప్పటానికి మరో కారణం ఆ సంస్థకు ధనసహాయం చేసేది కూడా భత్కల్ కాబట్టి. భత్కల్ ఏం చేసి ధనసహాయం చేస్తున్నాడు అని చూస్తే, దొంగనోట్ల పంపిణీ ద్వారా అని కూడా తెలుస్తోంది. ఆ నోట్లు దుబాయ్ నుంచి హవాలా ఆపరేటర్ల మద్దతుతో దేశంలోకి వచ్చిపడుతున్నాయి. అసలు డబ్బు ఎందుకు అవసరం పడిందంటే, 2008 లో బాట్లా హౌస్ లో ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత ఇండియన్ ముజీహిదీన్ సంస్థ ఇంజినీర్లు, డాక్టర్ల లాంటి చదువుకున్నఉగ్రవాదులను పనిలో పెట్టుకోలేక పోయింది. దర్భంగా లో జరిగిన బాంబు దాడిలో యాసిన్ భత్కల్, ఉగ్రవాదం తలకెక్కటం వలన కాక డబ్బు కోసం పనిచేసే వాళ్ళని పెట్టుకోవలసివచ్చింది.
భత్కల్ మీద పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావటంతో అన్ని రాష్ట్రాల పోలీసులు భత్కల్ కస్టడీని కోరుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more