తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కొలువైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీలో ఏ రాజకీయ పని మీద ఉన్నరో తెలియదు గానీ, ఈ రోజ మాత్రం ఆయన ఢిల్లీలో వాకౌట్ చేశారు. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ) సమావేశాన్ని చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావించవద్దని అడ్డుకున్నారు. అందుకే ఎన్ఐసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ సమస్యలు సృష్టిస్తోందని, రాష్ట్ర సమస్యలను ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఉండే మేధావులు విభజనపై ఆలోచించాలని కోరారు. సీఎం కిరణ్ రాష్ట్రంలోని సమస్యలను పట్టించుకునే స్థితిలో లేరని మండిపడ్డారు. ఇరుప్రాంతాల నేతలతో చర్చించి సమస్య పరిష్కారంచేయాలని ఆయన కోరారు. ఎన్ఐసీలో తన ప్రసంగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర హోం మంత్రి షిండేలు అడ్డుకున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో నడుస్తున్నారని, ఆయన సీటు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కనీసం తనకు మద్దతు తెలపలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more