బాలీవుడ్ లో ఇటీవల హాట్ ఎఫైర్లు సాగించిన జంటగా వార్తల్లోకి ఎక్కిన కత్రినా కైఫ్ - రణబీర్ కపూర్ లు 2014 లో మూడుముళ్ళ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆ మధ్యన వీరిద్దరు న్యూయార్క్ ప్రపంచాన్ని మరిచి బీచుల్లో రణబీర్ అర్థ నగ్నంగా... కత్రినా బికినీతో తెగ ఎంజాయ్ చేసిన ఫోటోలు బయట పడిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు లీకవ్వడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఏ రేంజ్ లో ఉందో అందరికి అర్థం అయింది.
ఆ సంఘటన తరువాత కూడా వీరిద్దరి మా మధ్య ఉన్నది కేవలం మంచి బంధం, ఫ్రెండ్ షిప్ అని... దాని కామెంట్ అంటూ తప్పించుకున్నారు. ఆ తరువాత రణ్ బీర్ ఫ్యామిలీ అతని పై ఫైర్ అయ్యారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇటీవల జరిగిన రణ్ బీర్ కపూర్ బర్త్ డే పార్టీకి కత్రినా వచ్చి ఆ రాత్రి ఇద్దరు ఏకాంతంగా గడిపారు. మా మధ్య ఏమి లేదని చెబుతూనే ఇలా ఎంజాయ్ చేస్తున్న వారి పై రూమర్లు రోజుకోటి పుట్టుకొని రావడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టి పెళ్లి పీఠలు ఎక్కాలని డిసైడ్ అయినట్లు బాలీవుడ్ సెలబ్రెటీలు అంటున్నారు. గత కొంత కాలంగా రణ్‌భీర్, కత్రినా ఇద్దరూ పర్సనల్ లైఫ్‌ను ప్రవేట్‌గా ఎంజాయ్ చేస్తున్నారని, వీళ్ళకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడిందని ఇక పెళ్లి ఒక్కటే మిగిలిందని, వీరి పెళ్లికి ఇంట్లో వారి అంగీకారం కూడా పూర్తయిందని చెప్పుకుంటున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2014 జులై లోపు వీరి పెళ్లి జరగవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వీరు కమీట్ అయిన సినిమాలు మార్చి వరకు కొన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తరువాత జులై నుండి కత్రినాకు కాల్షీట్లు ఉండటంతో ఏప్రిల్ మే మధ్యలో పెళ్లి బాజాలు మోగడం ఖాయం అంటున్నారు. మరి పెళ్లి వరకు ఆగలేక ఈ మధ్యలో ఏదైనా టూర్ ప్లాన్ చేసి మళ్ళీ ఎంజాయ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more