టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన దర్శకధీరుని ‘మగధీర ’ సినిమా అప్పటి నుండి మొన్నటి వరకు ఆల్ టైం రికార్డుగా నిలిచింది. 2009 లో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీసు కలెక్షన్లను షేక్ చేసి 73 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రికార్డును దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా. ఇప్పటికీ దూసుకుపోతూ 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.
ఈ సినిమా ‘మగధీర ’ రికార్డులను బ్రేక్ చేయడం పై దర్శకధీరడు స్పందించాడు. తమ సినిమా రికార్డులను ‘అత్తారింటికి దారేది ’ సినిమా అధిగమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిగారు మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ, ‘తెలుగులో ఒక మంచి సినిమా నిర్మిస్తే కనుక 100 కోట్ల సినిమా అవుతుంది. అంతటి శక్తి తెలుగు సినిమాకు వుంది ’ అన్నారు. ఆ సమయంలో ఆయన మాటలు జోక్ లా అనిపించి మేం నవ్వుకున్నాం.
కానీ, ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. కానీ ‘అత్తారింటికి దారేది ’ సినిమా యూనిట్ కే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం అంటూ ట్విట్టెర్లో పోస్ట్ చేస్తూ... పవన్ కల్యాణ్ కి, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలిపాడు. తన సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టినా కానీ... ఆ సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపి తన మంచి మనస్సును చాటుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more