మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాగాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి సీటును అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అమ్మ జపం చేసి, వారు ఏదంటే దానికి తలూపిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అధిష్టానానికి ఏకు మేకై కూర్చున్నాడు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ ఏర్పాటుకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తూ, అధిష్టానానికి చెందిన పెద్దలకే లేఖాస్త్రాలు సంధిస్తూ... నేను పదవిలో ఉండగా రాష్ట్రాన్ని విడిపోనీయనని ఖరాఖండిగా చెప్పుకొస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి పై అధిష్టానం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
తాను అనుకున్న పనిని ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకొని పోవాలనుకునే కాంగ్రెస్ అధిష్టానం తనకు అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి కిరణ్ ని పదవి నుండి తప్పించాలని ఒక నిర్ణయానికి వచ్చిందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తుంది. కిరణ్ ని తప్పించడం సోనియాకు క్షణం చాలు. కానీ ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టాలా ? వద్దా ? పెడితే ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏంటి ? అనే విషయాల పై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి రానున్న తరుణంలో ముఖ్యమంత్రిని తొలగిస్తే మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని
ఇప్పటికే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న సీఎం తనను పదవి నుంచి తొలగిస్తే సీరియస్‌గా పరిగణించి, తనను పదవీచ్చుతిడిని చేస్తే కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో సి.ఎం. వున్నారనే ప్రచారం జరుగుతుండటం, కిరణ్‌ను బయ టకు సాగనంపితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పుట్టి ముంచే సామర్ధ్యాన్ని ఆయన సమకూర్చుకున్నాడని, వెళుతూ వెళుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులను, కొంత మంది శాసన సభ్యులను వెంటేసుకొని వెళ్ళడానికి రంగం సిద్దం చేసుకున్నాడని తెలుసుకున్న అధిష్టానం ఆయన పై చర్యలు తీసుకోవడానికి మల్లగుల్లాలు పడుతుంది. ]
అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రిని దారిలోకి తెచ్చుకొని రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తరువాత కిరణ్ పై చర్యలు తీసుకోవాలని భావిస్తుందని అంటున్నారు. ‘ఒడ్డు దాటిన తరువాత తెప్పను కాలబెట్టినట్లుగా ’ అవసరం అయ్యాకా కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపితం అయింది. ఇప్పుడు నల్లారిని విషయంలో అలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more