Four issues that need to be resolved before telangana

state bifurcation, seemandhra,telangna, Four issues, GoM, Article 371-D, Central Home department

The note titled Background note for the Group of Ministers( GoM) regarding the creation of the state of Telangana from the existing state of Andhra Pradesh crystallises the job the government must do.

విభజించాలంటే సవరించాల్సిందే..

Posted: 10/30/2013 10:46 AM IST
Four issues that need to be resolved before telangana

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి రాజ్యంగంలోని ఆర్టికల్ 371-డి అంశానికి ఏం చేయాలనే విషయం పై కేంద్రం తర్జన భర్జన పడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సాఫీగా సాగాలంటే రాజ్యాంగంలోని 371-డి అధికరణాన్ని సవరించాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పేసింది. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో స్థానికులకు విద్య, ఉపాది అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ లోని వారికి రక్షణ కల్పించడానికి 1973లో జారీ అయిన ఈ అధికరణాన్ని సవరించక తప్పదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి అందజేసిన నేపథ్య పత్రం (బ్యాక్‌గ్రౌండ్ నోట్)లో ఈ విషయాన్ని ప్రధానంగా పేర్కొంది. జీవోఎం లోతుగా దృష్టి సారించాల్సిన నాలుగు ప్రాథమ్య అంశాల్లో దీన్ని హోం శాఖ ప్రధానంగా చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నందున ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకు సముచితమైన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి 371-డి అధికరణాన్ని సవరించడంతో పాటు హైదరాబాద్‌లో విద్య, ఉపాధి అవకాశాల విషయమై ఇతర రక్షణ చర్యలేవైనా చేపట్టడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముంద అని అందులో స్పష్టంగా పేర్కొంది.

విభజన అనంతరం ఏర్పడబోయే రెండు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా తదితర నదీ జలాల పంపకాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ సజావుగా పర్యవేక్షించేందుకు పూర్తి అధికారాలతో కూడిన చట్టబద్ధమైన, స్వతంత్ర సాంకేతిక జల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రాష్ట ఖజానాకు చేరుతున్న అమ్మకం పన్నులో 75 శాతం హైదరాబాద్ నుండే వస్తుస్తున్నట్లు మిగిలింది కోస్తాంధ్ర, రాయల సీమ తెలంగాణ నుండి వస్తున్నట్లు తెలిపింది. పోలవరం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులు రెండూ జాతీయ ప్రాజెక్టుల పరిశీలనలో ఉన్నట్లు గుర్తుచేసింది. జల వనరులు, విద్యుత్ వనరులు, హైదరాబాద్ నగరం, 371-డి అధికరణం-రాష్ట్రపతి ఉత్తర్వులు... ఈ నాలుగింటిని ప్రాథమ్యాంశాలుగా పేర్కొంది. వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టి, లోతుగా పరిశీలించాల్సిందిగా జీవోఎంను కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more