అవును ..సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి? అనే పశ్నకు .. అనేక సమాధానాలు అన్నట్లు . ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. ప్రక్రుతి విపత్తు జరిగితే.. నష్టపోయేది ప్రజలే, మానవ తప్పిదం వల్ల జరిగే ప్రమాదం వల్ల నష్టపోయేది .. ప్రజలే, అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయేది ప్రజలే, నిద్రపోతున్న ప్రభుత్వం వల్ల నష్టపోయేది ప్రజలే .. మొత్తం ఎటు నుంచి ప్రమాదం జరిగిన చివరకు నష్టపోయేది మాత్రం ప్రజలే. ఇప్పుడు ఎవరు సిగ్గుతో తలదించుకోవాలి? ఎవరి మీద నిందలు వేయాలి? ఈ ప్రశ్నకు ఎవరు సమాదనం చెప్పగలరు? మనం చేసుకున్న తప్పుకు మనమే సిగ్గుతో తలదించుకోవాలి? అనేది మాత్రం అర్థం అవుతుంది.
ప్రక్రుతి విపత్తు వలన రైతు కుటుంబాలు, సామాన్య ప్రజలు పూర్తిగా నష్టపోయారు. మహాబూబ్ నగర్ జిల్లా కొత్త కోట లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలబైఅయిదు కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నా విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సి అవసరం ఉంది. ఒకేసారి 45 మంది ప్రయాణికులు.. మంటల్లో కాలిపోతు.. చివరిగా వారు చేసిన ఆర్తనాదాలు తలుచుకుంటే.. చాలు మనం సిగ్గుతో తలదించుకోవాలి. అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది? దీనికి బాద్యులు ఎవరు అంటే? ఖచ్చితంగా అందరు ఒకటే మాట చెబుతారు. వోల్వో బస్సు నడుపుతున్న డ్రైవర్ దే అని చెబుతున్నారు. అంటే డ్రైవర్ కళ్ల ముందు కనిపిస్తున్నారు కాబట్టి అందరు వేళ్లు డ్రైవర్ వైపే చూపటంలో ఆశ్చర్యంలేదు. కానీ కంటికి కనిపించకుండా ఉన్నవాళ్ల సంగతి ఏమిటి? ఎవరైన వారి గురించి ఆలోచించారా? వారిపై ఎవరైన వేలేత్తి చూపిస్తారా? అంటే చాలా అరుదుగా జరుగుతుంది.
ఎక్కడైన ప్రమాదం జరిగినప్పుడే.. మనకు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ చట్టాలు గుర్తుకు వస్తాయి? అంటే అప్పటి వరకు మనం నిద్రమొత్తులో ఉన్నామని నగ్న సత్యాన్ని మనమే చెప్పుకుంటున్నాం. ప్రభుత్వ అధికారుల పై రాజకీయ ఒత్తిడి వలనో, లంచానికో, లేక మంచానికో ఆశపడి, గుడ్డిగా సంతకాలు చేసిన ప్రభుత్వ అధికారులు సిగ్గుతో తలదించుకోవాలి? రాజకీయ నాయకులకు లొంగి, కాసులకు కక్కుర్తి పడి, క్షణికావేశంలో చేసిన తప్పుకు ఈ రోజు 45 కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అధికారుల మొద్దునిద్ర వల్ల.. ఇలాంటి పరిస్థితి దాపరించినందుకు.. సిగ్గుతో తల దించుకోవాలి.
మనిషి ప్రాణాలు పోయిన తరువాత హడవుడి చేసే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. మనిషి బ్రతికున్నప్పుడు పట్టించుకోని తప్పులు, పట్టించుకోని ప్రభుత్వం, ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగినప్పుడు మాత్రమే పరుగులు తీసి, పది రోజులు హడవుడి చేసి , తరువాత చేతులు దులుపుకోవటం మాములే అనే విషయం అందరికి తెలుసు. అయిన ప్రభుత్వం, రాజకీయ నాయకుల తప్పు ఉన్నట్లే, మనిషి తప్పు కూడా ఉందిలేండి? ‘‘నిధానమే ప్రధానం’’, ‘‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి.. సురక్షితంగా మీ గమ్యం చేరుకోండని ’’ తాటికాయంత అక్షరాలతో రాసి ఉన్నప్పటికి మనం పాటించం, అసలు పట్టించుకోం. కంప్యూటర్ యుగంలో.అన్ని వేగంగా జరిగిపోవాలి అని కోరుకునే వారు ఎక్కువుగా ఉన్నారు.
అలాంటి వారి వేగాన్ని కొన్ని సంస్థలు క్యాష్ చేసుకోవటానికే ..పుట్టుకోస్తున్నాయి. వేగం మనిషి ప్రాణాలు తీస్తుందనే అందరికి తెలుసు. మనిషి గుండె 72 సార్లు కొట్టుకుంటే.. మనిషి హాయిగా ఉంటాడు. అదే గుండే నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటే పరిస్థితి ఏమిటో నేను చెప్పనవసరం లేదు. ఇలాంటి విషయాలు తెలిసినప్పటికి .. మనిషి మాత్రం వేగం పై పరుగులు తీస్తాడు. ఎందుకంటే.. అప్పుడు ప్రాణం విలువ మనిషికి తెలియదు కాబట్టి. ఎంతైన ఇప్పుడు టచ్ స్ర్కిన్ యుగం నడుస్తుంది. మనిషి వేగంతో పోటిపడుతున్నారు అనేది నిజం.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఉదయం 5.10 గంటలకు వోల్వో బస్సు మంటల్లో కాలిపోతుంటే.. వారికి కాపాడేందుకు ఎవరు సాహసం చేయ్యకపోవటమే పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఘటన స్థలం ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు.. హైవే రోడ్డు పైనే జరిగింది. ప్రమాదం జరుగుతున్నప్పుడు బస్సు పక్కనే అనేక వాహనాలు, ట్రావెల్స్ కు సంబందించి బస్సులు వెళ్లి ఉంటాయి. కానీ ఏ ఒక్కరు కూడా మంటల్లో కాలిపోతున్న వారిని గురించి ఆలోచించలేదు. మంటల్లో కాలిపోతున్న వారిని చూసి అయ్యో పాపం, అంటూ నిట్టుర్పూలు విసురుతు వెళ్లిన వారు చాలా మంది ఉంటారు.
వారు ఇంటికి వెళ్లి మేము వచ్చే దారిలోనే జరిగింది, ఆ బస్సు పక్క నుంచే మేము వచ్చాం అని తోటి వారితో గొప్పగా చెప్పుకుంటారు? కానీ మేము వారిని కాపాడలేకపోయం అని బాధపడేవారు అతి తక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా వారికి బ్రతికే అద్రుష్టం లేదని కొందరు వేదాలు పలుకుతుంటారు. అయితే ఇవి షరామాములే అనే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ప్రమాదంలో వ్యక్తి కోల్పోయిన కుటుంబాకు కలిగే బాధ ఏమిటో తెలియకపోవటమే పెద్ద ఆశ్చర్యం. మనకేందుకులే, అనే నిర్లక్ష్యమే మనిషి ప్రాణాలను సులువుగా తీసుకుంటుంది. ఆ మంటల్లో కాలిపోతుంది మనం కాదు కదా? అలా వేగంగా పోతుంది మనం కాదు కదా? అనే భావన రావటం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. ఆ మంటల్లో నేను కాలిపోతుంటే, ఆ ప్రమాదంలో నా బంధువుల ఉంటే అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.
ఏమైన ఈ సంఘటన గురించి మనం పది రోజలు, లేదా ఒక నెల రోజులు చెప్పుకుంటాం...కానీ తరువాత మళ్లీ షరామాములే. అధికారులు అలాగే ఉన్నారు, ప్రభుత్వం అలాగే ఉంది, అంతకంటే మనం కూడా అలాగే ఉన్నాం. కాబట్టి మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more