తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంచి దూకుడు మీద ఉంది. తెలంగాణ విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఈ రోజు 8 శాఖల కేంద్ర కార్యదర్శులతో సమావేశమైంది. ఉదయం, భోజన విరామం తర్వాత రెండు విడతలుగా సమావేశమై ఈ 8 శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది.
సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, నారాయణ స్వామి, జైరామ్ రమేశ్, గులాంనబీ ఆజాద్ పాల్గొన్నారు. నీరు, పెట్రోలియం, వైద్యం, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ నెల 14న మరోసారి జిఓఎం సమావేశమవుంతుంది.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి ఆంటోనీతో సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. ఆంటోనీని కలిసినవారిలో చిరంజీవి, జేడి శీలం పురంధేశ్వరి ఉన్నారు.
అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని షిండే స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం అనంతరం షిండే మాట్లాడుతూ యూపీఏ -2 పదవీ కాలం పూర్తయ్యేలోపు తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే ప్రకటించారు.
ఉమ్మడి రాజధాని విషయంలో హైదరాబాద్ పరిధిపై జీవోఎంకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. అవన్నింటినీ కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. 371డి సంగతి జీవోఎం చూసుకుంటుందని షిండే చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more